AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Grounding Walking: చెప్పులు లేకుండా పచ్చగడ్డిపై నడిస్తున్నారా.. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి!

సాధారణంగా వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అందులోనూ ఉదయం వాకింగ్ చేస్తే.. వెయిట్ లాస్ అవ్వడంతో పాటు అనేక ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి. వాకింగ్ చేయడంలో విభిన్న మార్గాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో గ్రౌండింగ్ లేదా ఎర్తింగ్ కూడా ఒకటి. చెప్పులు లేకుండా పచ్చ గడ్డి మీద నడవడమే గ్రౌండింగ్. మరి చెప్పులు లేకుండా పచ్చగడ్డి మీద నడవడం ఆరోగ్యానికి మంచిదేనా? అసలు చెప్పులు లేకుండా గడ్డి మీద నడవడం నిజంగానే..

Grounding Walking: చెప్పులు లేకుండా పచ్చగడ్డిపై నడిస్తున్నారా.. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి!
Grounding Walking
Chinni Enni
|

Updated on: May 25, 2024 | 2:58 PM

Share

సాధారణంగా వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అందులోనూ ఉదయం వాకింగ్ చేస్తే.. వెయిట్ లాస్ అవ్వడంతో పాటు అనేక ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి. వాకింగ్ చేయడంలో విభిన్న మార్గాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో గ్రౌండింగ్ లేదా ఎర్తింగ్ కూడా ఒకటి. చెప్పులు లేకుండా పచ్చ గడ్డి మీద నడవడమే గ్రౌండింగ్. మరి చెప్పులు లేకుండా పచ్చగడ్డి మీద నడవడం ఆరోగ్యానికి మంచిదేనా? అసలు చెప్పులు లేకుండా గడ్డి మీద నడవడం నిజంగానే ఆరోగ్యానికి మంచిదా? దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి? మరి పచ్చ గడ్డి మీద నడవడంపై వైద్య శాస్త్రం ఏం చెబుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం.

మనస్సుకు – శరీరానికి కనెక్షన్:

పచ్చగడ్డిపై చెప్పులు లేకుండా నడవడాన్ని గ్రౌండింగ్ అని అంటారు. ఇలా భూమిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. భూమికి, శరీరానికి మధ్య కనెక్షన్‌ని ఏర్పాటు చేస్తుంది. ఇందులో భూమి నుండి శరీరానికి ఎలక్ట్రాన్‌లను బదిలీ చేస్తుంది. కాళ్లలో వచ్చే మంటను, నిద్ర నాణ్యతను మెరుగు పరుస్తుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది:

పచ్చ గడ్డిపై నడవడం వల్ల మనస్సు, శరీరంపై పడే ఒత్తిడి తగ్గుతుంది. ఇది ప్రశాంతతను చేకూరుస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. భూమి మీద నడిచినప్పుడు పాదాల గుండా వైబ్రేషన్.. శరీరంలోకి ప్రవేశిస్తుంది.

ఇవి కూడా చదవండి

పాదాల సమస్యలు తగ్గుతాయి:

కాళ్లు చెప్పులు లేకుండా పచ్చ గడ్డిపై నడవడం వల్ల పాదాలకు ఎనలేని శక్తి లభిస్తుంది. ఇది పాదాలకు సంబంధించిన సమస్యలు, నొప్పులు, వాపును తగ్గించడంలో సహాయ పడుతుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

పచ్చ గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మట్టిలో ఉండే సూక్ష్మ జీవుల ప్రభావం కారణంగా ఇమ్యూనిటీ బల పడుతుంది. దీంతో రోగాలు, అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి లభిస్తుంది. అంతే కాకుండా గట్ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి.. మానసిక స్థితి కూడా చురుగ్గా ఉంటుంది.

రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది:

పచ్చ గడ్డిపై చెప్పులు లేకుండా నడవటం వల్ల.. శరీరంలో రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. శరీర భాగాలకు కూడా రక్త ప్రసరణ జరుగుతుంది. దీంతో అన్ని భాగాలూ చక్కగా పని చేస్తాయి. చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగు పడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్