Food: సాయంత్రం స్నాక్స్‌ తింటున్నారా.? సమస్యలు తప్పవంటున్న నిపుణులు..

అయితే మధ్యాహ్నం లంచ్‌కు రాత్రి చేసే డిన్నర్‌కు మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. దీంతో ఈ గ్యాప్‌ను ఫిల్‌ చేసేందుకు చాలా మంది స్నాక్స్‌ తీసుకుంటారు. స్నాక్స్‌ అనగానే మనలో చాలా మంది మిర్చిలు, బజ్జీలు, స్ట్రీట్ ఫుడ్స్‌ను ఎక్కువగా మొగ్గు చూపుతుంటాం. అయితే ఇలాంటి ఫుడ్‌ వల్ల ఆరోగ్యాన్ని అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం...

Food: సాయంత్రం స్నాక్స్‌ తింటున్నారా.? సమస్యలు తప్పవంటున్న నిపుణులు..
Lifestyle News
Follow us

|

Updated on: May 25, 2024 | 2:21 PM

మనిషి ఆహారం లేకుండా బతకలేడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తీసుకునే ఆహారంలో చేసే తప్పులు అనారోగ్యానికి దారి తీస్తాయని తెలిసిందే. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని నిపుణులు చెబుతుంటారు. అందుకే తీసుకునే ఆహారం విషయంలో కచ్చితంగా పలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తుంటారు. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్‌ సహజంగా ప్రతీ ఒక్కరూ ఇదే డైట్‌ను ఫాలో అవుతుంటారు.

అయితే మధ్యాహ్నం లంచ్‌కు రాత్రి చేసే డిన్నర్‌కు మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. దీంతో ఈ గ్యాప్‌ను ఫిల్‌ చేసేందుకు చాలా మంది స్నాక్స్‌ తీసుకుంటారు. స్నాక్స్‌ అనగానే మనలో చాలా మంది మిర్చిలు, బజ్జీలు, స్ట్రీట్ ఫుడ్స్‌ను ఎక్కువగా మొగ్గు చూపుతుంటాం. అయితే ఇలాంటి ఫుడ్‌ వల్ల ఆరోగ్యాన్ని అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి స్నాక్స్‌ను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హెవీ ఫుడ్‌కు దూరంగా ఉండాలని చెబుతున్నారు. సాయంత్రం ఎక్కువగా తినడం వల్ల సహజంగానే రాత్రి ఆహారం ఆలస్యంగా తీసుకుంటాం ఇది అనారోగ్య సమస్యలు దారి తీస్తుంది.

రాత్రుళ్లు ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఊబకాయం, నిద్రలేమి వంటి సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. అందుకే సాయంత్రం స్నాక్స్‌ను తగ్గించాలని చెబుతున్నారు. ఒకవేళ ఆకలిగా ఉండే ఏదైనా ఒక పండు లేదా నిమ్మరసం, మజ్జిగ వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే ఒక చిన్న కప్‌ కాఫీ, టీతో సరిపెట్టాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల బరువు పెరగడం వంటి సమస్య బారిన పడకుండా ఉండొచ్చని చెబుతున్నారు. ఇక స్నాక్స్‌లో డ్రై ఫ్రూట్స్‌ తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నూనెతో చేసిన ఫుడ్‌కు దూరంగా ఉండాలని అంటున్నారు.

సాయంత్రం చిరు తిళ్లు తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా స్వీట్స్‌, జంక్‌ ఫుడ్‌ వంటి వాటిని తీసుకోవడం వల్ల ఊబకాయంతో పాటు హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దానికి బదులుగా లిక్విడ్ డైట్ తీసుకొని రాత్రి 8 గంటలకల్లా డిన్నర్‌ను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..