AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care: మీరు చేసే ఈ తప్పులు మీ చర్మాన్ని పాడు చేస్తాయి.. అవేంటంటే..

ఇంతకీ చర్మ ఆరోగ్యం దెబ్బ తినడానికి కారణమయ్యే ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్మోకింగ్ చేయడం ఆరోగ్యానికి హానికరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధూమపానం వల్ల ఎన్నో రకాల సమస్యలు వెంటాడుతాయి. ముఖ్యంగా లంగ్‌ క్యాన్సర్‌ మొదలు శరీరంలో ఎన్నో భాగాల పనితీరును ధూమపానం దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతూనే ఉంటారు...

Skin Care: మీరు చేసే ఈ తప్పులు మీ చర్మాన్ని పాడు చేస్తాయి.. అవేంటంటే..
Skin Care
Narender Vaitla
|

Updated on: May 25, 2024 | 1:51 PM

Share

అందంగా కనిపించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో లభించే ఎన్నో రకాల క్రీములను ఉపయోగిస్తుంటారు. అయితే చర్మ ఆరోగ్యం అనేది మన జీవన విధానంపైనే ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా.? మనకు తెలిసో, తెలియకో చేసే కొన్ని తప్పుల కారణంగా చర్మం నిర్జీవంగా మారుతుంది.

ఇంతకీ చర్మ ఆరోగ్యం దెబ్బ తినడానికి కారణమయ్యే ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్మోకింగ్ చేయడం ఆరోగ్యానికి హానికరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధూమపానం వల్ల ఎన్నో రకాల సమస్యలు వెంటాడుతాయి. ముఖ్యంగా లంగ్‌ క్యాన్సర్‌ మొదలు శరీరంలో ఎన్నో భాగాల పనితీరును ధూమపానం దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతూనే ఉంటారు. అయితే స్మోకింగ్‌ వల్ల చర్మంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని మీకు తెలుసా.? అవును నిత్యం స్మోకింగ్ చేసే వారి చర్మం అందహీనంగా మారడంతో పాటు డ్రై స్కీన్‌గా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే ఎక్కువ వేడి నీళ్లతో స్నానం చేసినా, ముఖం కడుక్కున్నా చర్మానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల చర్మం దెబ్బతింటుందని అంటున్నారు. ముఖ్యంగా చర్మం పొడిబారిపోతుంది. చర్మంపై ఉండే సజహ తేమ పోయి డ్రై స్కిన్‌గా మారుతుంది. ఇక తీసుకునే ఆహారం కూడా చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉప్పు, పంచదార ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా హాని కలుగుతుంది అంటున్నారు.

ఇక కొందరు ముఖం నిగనిగలాడాలని ఎక్కువసార్లు స్క్రబ్‌ చేస్తుంటారు. అయితే దీని వల్ల చర్మంపై పొర దెబ్బ తింటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎక్కువసార్లు స్క్రబ్‌ చేయడాన్ని మానుకోవాలి. అలాగే ఎక్కువగా స్విమ్మింగ్ చేసే వారిలో కూడా చర్మం దెబ్బతినే అవకాశం ఉంటుందని అంటున్నారు. చర్మం నిత్యం యవ్వనంగా ఉండాలంటే తీసుకునే ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నిత్యం హైడ్రేట్‌గా ఉండేందుకు నీటితో పాటు విటమిన్‌ సి ఎక్కువగా లభించే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

మీరు చెప్తే విశ్వం వింటుంది!.. ఈ టెక్నిక్‌తో మీ కోరికలు నెరవేర్చు
మీరు చెప్తే విశ్వం వింటుంది!.. ఈ టెక్నిక్‌తో మీ కోరికలు నెరవేర్చు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే