- Telugu News Photo Gallery These are the changes that happen in the body if you eat potatoes, check here is details
Potato for Heart: బంగాళ దుంపలను తింటే శరీరంలో జరిగేది ఇదే.. డోంట్ మిస్!
కూరగాయల్లో చాలా మంది ఇష్టంగా తినే వాటిల్లో బంగాళ దుంప కూడా ఒకటి. బంగాళ దుంపలతో ఎలాంటి వంటలు అయినా తయారు చేసుకోవచ్చు. కూరలు, ఫ్రైలు ఏం తయారు చేసినా చాలా రుచిగా ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎక్కువగా ఉపయోగించే వాటిల్లో బంగాళ దుంప ముందుగా ఉంటుంది. ఏ కాలంలో అయినా అతిగా ఇష్టపడి తినే వాటిల్లో ఆలూ కూడా ఉంటుంది. బంగాళ దుంపల్లో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. పొటాషియం, విటమిన్ సి, డైటరీ, ఫైబర్‌లు పుష్కలంగా..
Updated on: May 25, 2024 | 1:46 PM

Potato For Heart

బంగాళ దుంపల్లో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. పొటాషియం, విటమిన్ సి, డైటరీ, ఫైబర్‌లు పుష్కలంగా లభ్యమవుతాయి. ఆలూ తినడం వల్ల గుండె జబ్బులు, అకార మరణం వచ్చే ఛాన్సులు చాలా తక్కువగా ఉంటాయని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది.

శరీరంలో విటమిన్ B6 లోపాన్ని తీర్చడానికి బంగాళాదుంపలను కూడా తినవచ్చు. ఇందులో విటమిన్-బి6, విటమిన్-సి, పొటాషియం, కార్బోహైడ్రేట్లు అధిక మొత్తంలో ఉంటాయి. అవి ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు బంగాళదుంపలను ఎక్కువగా తినకూడదు.

ఈ దుంపలో ఫైబర్‌తో పాటు కార్బోహైడ్రేట్లు, విటమిన్లు కూడా లభిస్తాయి. అవి శరీరానికి తక్షణ శక్తి ఇవ్వడంతో తోడ్పడతాయి. అదే విధంగా ఆలు గడ్డలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా చక్కగా ని చేస్తుంది. దీంతో మల బద్ధకం, అజీర్తి కూడా తగ్గుతుంది.

కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు బంగాళాదుంప చక్కటి పరిష్కారం అవుతుంది. ఆలూతో కూడా మీరు కూరలో ఉప్పును తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ఉడకబెట్టిన బంగాళాదుంపల తొక్కతీసి గుజ్జుగా చేయండి. దీన్ని ఉప్పగా ఉండే కూరగాయలో వేసి కలుపుకుంటే ఉప్పు రుచి తగ్గి కూరలు టేస్టీగా అవుతాయి.




