Migraine Relief Tips: మైగ్రేన్ సమస్యతో తల బద్ధలైపోతుందా.. ఈ చిట్కాలు చాలా బెస్ట్!
మైగ్రేన్ తల నొప్పి అనేది ఎంతో తీవ్రంగా ఉంటుంది. ఇది న్యూరోలాజికల్ సమస్య. వికారం, వాంతులు, చెవి లోపల శబ్దాలకు సున్నితత్వం వంటి లక్షణాలు ఉంటాయి. మైగ్రేన్ రావడానికి ఖచ్చితమైన కారణాలు ఏంటి అనేవి ఇప్పటికీ తెలియలేదు. అయితే ఈ మైగ్రేన్‌ను తగ్గించుకోవడానికి మాత్రం అనేక చిట్కాలు ఉన్నాయి. ట్యాబ్లెట్స్‌తో ఉపశమనం పొందినా.. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంటి చిట్కాలు పాటించడం చాలా బెటర్. మైగ్రేన్‌కు తక్షణ ఉపశమనం అందించే..
మైగ్రేన్ తల నొప్పి అనేది ఎంతో తీవ్రంగా ఉంటుంది. ఇది న్యూరోలాజికల్ సమస్య. వికారం, వాంతులు, చెవి లోపల శబ్దాలకు సున్నితత్వం వంటి లక్షణాలు ఉంటాయి. మైగ్రేన్ రావడానికి ఖచ్చితమైన కారణాలు ఏంటి అనేవి ఇప్పటికీ తెలియలేదు. అయితే ఈ మైగ్రేన్‌ను తగ్గించుకోవడానికి మాత్రం అనేక చిట్కాలు ఉన్నాయి. ట్యాబ్లెట్స్‌తో ఉపశమనం పొందినా.. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంటి చిట్కాలు పాటించడం చాలా బెటర్. మైగ్రేన్‌కు తక్షణ ఉపశమనం అందించే ఔషధాల కంటే.. నివారణ చర్యలు చాలా ముఖ్యం. మైగ్రేన్ రావడానికి కారణాలు, లక్షణాలు అనేవి వ్యక్తిగతంగా కూడా మారుతూ ఉంటాయి. ఈ తీవ్రమైన మైగ్రేన్ తల నొప్పిని తగ్గించుకునేందుకు చాలా నేచురల్ చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకునేందుకు చిట్కాలు ఇవే:
1. మైగ్రేన్ తల నొప్పి వస్తున్నప్పుడు.. వెలుగులోకి వెళ్లకపోవడమే చాలా మంచిది. చీకటి, నిశ్శబ్ద వాతావరణం బ్రెయిన్‌ని ప్రశాంత పరిచి, తగ్గించడానికి సహాయ పడుతుంది.
2. చల్లని కాంప్రెస్‌ను నుదుటిపై లేదా మెడ వెనుక భాగంలో పెట్టుకోవడం వల్ల రక్త నాళాలు, నొప్పి తగ్గుతుంది.
3. అల్లం, జీలకర్ర వంటి సుగంధ ద్రవ్యాలు మైగ్రేన్ తగ్గించే గుణాలు కలిగి ఉంటాయి. వీటిని టీలో వేసుకుని లేదా నేరుగా నమలడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
4. తగినంత నిద్ర లేకపోయినా కూడా మైగ్రేన్ వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నిద్ర సరిగ్గా ఉండేలా చూసుకోండం ముఖ్యం.
5. అదే విధంగా ఒత్తిడిని వల్ల కూడా మైగైన్ వస్తుంది. కాబట్టి వీలైనంత వరకూ ఒత్తిడిని తక్కువగా తీసుకోండి.
6. యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల కూడా మైగ్రేన్, తలనొప్పి వంటివి రాకుండా ఉంటాయి.
7. ప్రతి రోజూ ఒకే సమయంలో నిద్రపోవడం, ఆహారపు అలవాట్ల వల్ల కూడా మైగ్రేన్‌ని దూరం చేసుకోవచ్చు.
8. బాడీ డీ హైడ్రేషన్‌కు గురవడం వల్ల కూడా మైగ్రేన్, తలనొప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.
9. మైగ్రేన్ ఉన్నప్పుడు తలపై, మెడపై ఆయిల్‌తో తేలికపాటి మర్దనాలు చేస్తే నొప్పిని తగ్గించడంలో సహాయ పడతాయి. కాగా మైగ్రేన్ సమస్యలు తరచుగా వస్తున్నప్పుడు వైద్యులను సంప్రదించడం మేలు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.