Watch: ఏం టాలెంట్ గురూ.. ఏటీఎం జ్యూస్ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్… తాగినోళ్లకు తాగినంత..!
మన దేశంలోని గ్రామీణ యువత ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తూనే ఉంటారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. స్థానిక స్థాయిలో జరిగే ఇలాంటి ఆవిష్కరణలు సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించటం, ప్రశంసలు పొందటం సర్వసాధారణం. అలాంటి ఆవిష్కరణే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారతదేశవ్యాప్తంగా జుగాడ్ వ్యక్తులకు కొదువే లేదు.. అలాంటి వారు చేసే వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఒకరు సైకిల్‌ని కారులా మార్చేస్తే.. మరికొందరు అదే సైకిల్‌ని వాషింగ్ మెషీన్‌లా ఉపయోగిస్తుంటారు.. ఇంకొందరు వంటింట్లో ఉపయోగించే వంటపాత్రలను హెల్మెట్‌గా ధరించిన వారిని కూడా చూశాం..అలాంటిదే ఇక్కడో గ్రామీణ యువకుడు చేసిన జుగాడ్ ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. అతడు తన స్ప్లెండర్ బైక్‌ను ATM జ్యూస్ పాయింట్ యంత్రంగా మార్చేసిన తీరు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఈ ప్రత్యేకమైన జుగాడ్ నుండి డబ్బు విత్ డ్రా చేస్తున్నాడు. అందులో నుంచి జ్యూస్ కూడా తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మన దేశంలోని గ్రామీణ యువత ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తూనే ఉంటారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. స్థానిక స్థాయిలో జరిగే ఇలాంటి ఆవిష్కరణలు సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించటం, ప్రశంసలు పొందటం సర్వసాధారణం. అలాంటి ఆవిష్కరణే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బైక్‌ను కూల్‌డ్రింక్ వెండింగ్ మెషీన్‌గా మార్చిన ఓ యువకుడు బ్యాంక్ డెబిట్ కార్డుతో బైక్‌పై కూల్‌డ్రింక్స్ తీసుకుని తాగుతున్నాడు. విచిత్రమైన ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లు అవాక్కయ్యేలా చేస్తోంది.
View this post on Instagram
వైరల్ వీడియోలో ఓ యువకుడు స్పెలండర్ బైక్ ముందు భాగంలో ఏటీఎం కీ బోర్డు వంటిది ఏర్పాటు చేశాడు. అందులోని నంబర్లను నొక్కుతూ అతడు గ్లాస్‌లోకి కావాల్సిన జ్యూస్ తీసుకుని ఎంజాయ్ చేశాడు. అనంతరం తిరిగి తన కార్డును కూడా వెన్కి తీసుకున్నాడు. వీడియో చూసిన నెటిజన్లు యువకుడి ట్యాలెంట్‌ను తెగ ప్రశంసిస్తున్నారు. వీడియోని ఎక్కువగా షేర్ చేస్తూ మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి