- Telugu News Photo Gallery How Is Red Sandalwood So Beneficial To Your Skin And Body Read All About It
Red Sandalwood : ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే…
ఎర్ర చందనంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ వంటి లక్షణాలు పుష్కలంగా నిండివుంటాయి. ఎర్ర చందనం కలపతో విలావంతమైన ఫర్నీచర్ తయారు చేస్తారు. ఖరీదైన బొమ్మలు, సంగీత వాయిద్యాలను తయారు చేస్తారు. ఔషధాల తయారీలోనూ ఎర్ర చందనాన్ని ఉపయోగిస్తున్నారని ఆయుర్వేద ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఆయా లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jan 09, 2025 | 10:50 AM

ఎర్ర చందనం చర్మ సమస్యల నుంచి కాపాడుతుంది. చర్మన్ని కాంతివంతంగా ఉంచుతుంది. శరీరంలో మంట, అధిక దాహం సమస్యలకు ఎర్ర చందనం చెక్ పెడుతుంది. దీర్ఘకాలిక దగ్గు, జలుబు ఎర్ర చందనంతో నయం అవుతుంది.

నిపుణుల సూచన మేరకు ఎర్రచందనం వాడకంతో మధుమేహాన్ని నయం చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గ్యాస్ట్రిటిస్ సమస్యకు చికిత్స చేస్తుంది. ఇది నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కంటి వ్యాధులకు సహాయపడుతుంది. ఇది క్యాన్సర్‌తో పోరాడటానికి కూడా సహాయపడుతుంది.

ఇది అల్సర్ల నుంచి రక్తస్రావం కాకుండా నివారిస్తుంది. జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు సహాయపడుతుంది. శరీరానికి మంచి కూలింగ్ ఏజెంట్‌గా ఉపయోగపడుతుంది. ఎన్నో రకాల చర్మ సమస్యలను నయం చేయడంలోనూ ఎర్ర చందనం సహాయపడుతుంది. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఎర్ర చందనంలోని యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉన్నందున ఇది పరాన్నజీవి సంక్రమణను నిరోధించగలదు. పాము కాటుకు, తేళ్లు కుట్టిన వాటికి లేపనంగా ఉపయోగించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

ఇకపోతే, ఎర్ర చందనంలో పలు రకాల ఖనిజాలు కూడా ఉన్నాయి. ఎర్రచందనం కాపర్, యురేనియం, స్ట్రోంటియం, కాడ్మియం, జింక్ వంటి ఖనిజాలను కలిగి ఉన్నందున ఎర్రచందనం అనేక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి గాయాలను నయం చేయడానికి, రక్తం గడ్డకట్టడానికి, థైరాయిడ్ పనితీరుకు, మీ శరీరం ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి, నరాల కణాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి.





























