- Telugu News Photo Gallery Colorful Rangoli designs for you this Pongal Festival, Check Here is Details
Pongal Rangoli Designs: ఈ సంక్రాంతికి కలర్ ఫుల్ ముగ్గుల డిజైన్స్ మీకోసం..
సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. పిండి వంటలు, ఇంట్లోని బంధువులతో కోలాహలంగా ఉంటుంది. ఇక పల్లెటూర్ల సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంక్రాంతి పండగక్కి అందర్నీ ఎట్రాక్ట్ చేసే వాటిల్లో ముగ్గులు కూడా ఒకటి..
Updated on: Jan 09, 2025 | 12:45 PM

సంక్రాంతి పండుగ దగ్గర పడింది. సంక్రాంతి అంటేనే తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్ద పండుగ అని చెబుతూ ఉంటారు. ఎక్కడ ఉన్నా సరే సంక్రాంతి పండుగ సమయానికి పల్లెటూర్లకు, సొంత వాళ్ల దగ్గరకు చేరుకుంటారు. సంక్రాంతి అంటే ఎంతో సందడిగా ఉంటుంది.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగే సంక్రాంతి పండుగ హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా ఏ ఇంటికి వెళ్లినా ముందు కనిపించేవి రంగు రంగుల ముగ్గులు. మీ కోసం కొన్ని అందమైన ముగ్గులను మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ ఐడియాతో ఎన్నో ముగ్గులు వేసుకోవచ్చు.

ఎక్కువగా చాలా మంది గుడ్రంగా ఉండే ముగ్గులు పెడుతూ ఉంటారు. ఈ ముగ్గులు చాలా సింపుల్‌గా ఐపోవడమే కాకుండా.. చాలా అందంగా కనిపిస్తాయి. ఇలాంటి ముగ్గులను.. ముగ్గుల కాంపిటీషన్‌లో కూడా వేస్తూ ఉంటారు.

అలాగే అందర్నీ ఎక్కువగా ఆకట్టుకునేవి మోడ్రన్ ముగ్గులు. ఇవి వేయడం కాస్త కష్టంగా ఉన్నా.. లుక్ మాత్రం అదిరిపోతాయి. ఎక్కువగా చాలా మందిని ఎట్రాక్టీవ్ చేస్తాయి. ముందుగా మీకు నచ్చిన కలర్స్ వేసి.. ఆ తర్వాత ముగ్గుతో వేస్తే చాలా బాగుంటాయి.

ఈ మధ్య కాలంలో చాలా మంది నెమలి డిజైన్స్ ఎక్కువగా వేస్తున్నారు. ఇవి వేయడం కూడా సింపులే. కాస్త చేయి తిరిగితే.. చాలా బాగా వస్తాయి. సింపుల్‌గా ఒక నెమలి వేసి డిజైన్ వేస్తే ముగ్గు చాలా అందంగా కనిపిస్తుంది. వీటినే ముగ్గుల కాంపిటేషన్‌లో కూడా వేసి గెలుస్తున్నారు.




