- Telugu News Photo Gallery Cinema photos Know This Actress Who Acted With Vijay Thalapathy In Goat Movie, She Is Abhyuktha Manikandan
Vijay Thalapathy: విజయ్ దళపతితో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ? ఫాలోయింగ్ మాములుగా ఉండదు..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో విజయ్ పక్కన కనిపిస్తున్న అమ్మాయి ఎవరా అని తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు ? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసుకుందామా.
Updated on: Jan 09, 2025 | 12:31 PM

విజయ్ దళపతి తమిళ చిత్రపరిశ్రమలో స్టార్ హీరో. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తాజాగా విజయ్ దళపతికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

విజయ్ ఇటీవల నటించిన చిత్ర గోట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టాం. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ చెల్లి పాత్రలో నటించింది ఈ అమ్మాయి. జీవిత గాంధీ అనే పాత్రలో కనిపించిన ఈ బ్యూటీ పేరు అభ్యుక్త మణికందన్.

అభ్యుక్త మణికందన్ క్లాసికల్ డ్యాన్సర్. విజయ్ దళపతి నటించిన గోట్ సినిమాతోనే ఆమె సినీరంగంలోకి అడుగుపెట్టింది. చెన్నైలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు సినిమాటోగ్రాఫర్ మణికందన్ కూతురు.

అన్నియన్, ఓం శాంతి ఓం, బ్రహ్మాస్త్ర వంటి సూపర్ హిట్ సినిమాలకు మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. లా డిగ్రీలో పట్టా పుచ్చుకున్న అభ్యుక్త భరతనాట్యం నేర్చుకుంది. దేశంలోనే కాకుండా విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది.

2024లో విజయ్ నటించిన గోట్ చిత్రంలో అవకాశం వచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అభ్యుక్త నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లు మెంటలెక్కిస్తుంది.





























