Leopard video: వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలా ఎలా..

చిరుత సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ అధికారులు దాన్ని బంధించేందుకు పెద్ద సైజు వలలు పట్టుకుని అక్కడకు వచ్చారు. కానీ చిరుత మాత్రం వారికి చుక్కలు చూపించింది. దొరికినట్లు దొరికి.. ఇట్టేపారిపోయింది. చివరకు.. ఒక ఇంట్లో నక్కిన చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించగా అది ఒక్కసారిగా అక్కడున్నవారి మీద దాడికి దిగి.. పారిపోయేందుకు ప్రయత్నించింది. దాంతో స్థానికులంతా చెల్లచెదురుగా పారిపోయేందుకు ప్రయత్నించారు.

Leopard video: వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలా ఎలా..
Boy Catches Leopard
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 09, 2025 | 3:35 PM

సోషల్ మీడియాలో ప్రతి రోజూ జంతువులకు సంబంధించిన వీడియోలు అనేకం వైరల్ అవుతుంటాయి. ఇందులో ఎక్కువగా అడవి జంతువులు ఏనుగు, సింహాలు, పులుల వేటకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉంటాం. కానీ, కొందరు మనుషులు మాత్రం జంతువులతో క్రూరంగా ప్రవర్తింస్తుటారు. వారు చేసే పిచ్చి పనుల వల్ల ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా అనేకం చూస్తుంటాం. అయితే, కొన్ని సందర్భాల్లో మాత్రం క్రూర మృగాల పట్ల కొందరు ఆకతాయిగా ప్రవర్తిస్తుంటారు. అలాంటిదే ఈ సంఘటన కూడా.

కర్ణాటకలోని తుమకూరు జిల్లా రంగ్‌పూర్ గ్రామంలో చిరుతపులి బయటకు వచ్చింది. దాంతో హడలెత్తిపోయిన గ్రామస్తులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. గ్రామస్తులు, అటవీ అధికారుల సమక్షంలో చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ఓ యువకుడు చేసిన పని అందరినీ షాక్‌ అయ్యేలా చేసింది. ఆనంద్ కుమార్ అనే గ్రామస్థుడు ధైర్యంగా చిరుతపులిని తోక పట్టుకుని బోనులో బంధించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

అయితే, ముందుగా చిరుత సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ అధికారులు దాన్ని బంధించేందుకు పెద్ద సైజు వలలు పట్టుకుని అక్కడకు వచ్చారు. కానీ చిరుత మాత్రం వారికి చుక్కలు చూపించింది. దొరికినట్లు దొరికి.. ఇట్టేపారిపోయింది. చివరకు.. ఒక ఇంట్లో నక్కిన చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించగా అది ఒక్కసారిగా అక్కడున్నవారి మీద దాడికి దిగి.. పారిపోయేందుకు ప్రయత్నించింది. దాంతో స్థానికులంతా చెల్లచెదురుగా పారిపోయేందుకు ప్రయత్నించారు. ఒక వ్యక్తి మాత్రం వట్టి చేతులతో చిరుతను బంధించాడు. అదేదో.. బుజ్జి కుక్కపిల్ల లేదంటే, మేకను తోక పట్టుకుని లాగినట్లు చిరుత తోకను పట్టుకుని కదలకుండా బంధించాడు. ఆ వెంటనే అధికారులు దానిపై వలవేసి బంధించారు.

కాగా, ఇదంతా వీడియో రికార్డ్‌ చేసిన స్థానికులు సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దాంతో అది కాస్త వైరల్ గా మారింది. అతగాడి ధైర్యానికి మాత్రం నెటిజన్లు ఫిదా అవుతున్నారంట. ఏం గుండె బ్రో నీదంటూ అతనిపై ప్రశంసలు కుమ్మరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి