Emergency Movie: ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంకను కోరిన కంగనా.. ఇందిరమ్మ మనవరాలు ఏమన్నారంటే?
ఈ ఏడాది విడుదల కాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' ఒకటి. ఈ చిత్రంలో ఆమె దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు. అంతేకాదు ఈ మూవీకి నిర్మాతగా, దర్శకురాలిగా కూడా వ్యవహరిస్తోంది కంగనా రనౌత్
కంగనా రనౌత్ ఇప్పుడు నటిగానే కాదు దర్శకురాలు కూడా. ఎంపీ కూడా అవును. ఆమె బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చురుకుగా ఉంటున్నారు. ‘ఎమర్జెన్సీ’ సినిమాలో ఎమర్జెన్సీ ఘటననకు సంబంధించిన ఆసక్తికర విషయాలను బిగ్ స్క్రీన్‌పై చూపించనున్నారు కంగనా. ఇందులో ఇందిరా గాంధీ పాత్రలో ఆమె ఆహార్యం అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా జనవరి 17న విడుదలవుతోంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా కంగనా అన్ని చోట్లా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇటీవల పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ‘ఈ సినిమా గురించి మాట్లాడేందుకు ఇందిరా గాంధీ కుటుంబం మీ వద్దకు వచ్చిందా?’ అన్న ప్రశ్నకు కంగనా ఇలా సమాధానమిచ్చింది.
‘లేదు… వాళ్లెవరూ నాతో మాట్లాడలేదు. కానీ నేను ప్రియాంక గాంధీని పార్లమెంటులో కలిశాను. ఆమె నా వర్క్ ను ప్రశంసించారు. ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా నేను ఎమర్జెన్సీ సినిమా తీశానని, మీరు చూడాలని చెప్పాను. దీనికి ప్రియాంక కూడా సానుకూలంగా స్పందించారు’’ అని కంగనా రనౌత్ చెప్పింది.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ఇటీవల ‘ఎమర్జెన్సీ’ సినిమా రెండో ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. దీనికి సినీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఇందిరా గాంధీ పాత్రలో కంగనా ఆకట్టుకుందన్న కాంప్లిమెంట్స్ వచ్చాయి. 1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మరి ఈ మూవీ విడుదల తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.
ప్రియాంక సానుకూలంగా స్పందించారు: కంగనా రనౌత్
VIDEO | Here’s what actor and BJP MP Kangana Ranaut (@KanganaTeam) said responding to a query whether she had any interaction with the Gandhi family regarding her upcoming film ‘Emergency’.
“No, no, they didn’t reach out to me, but I met Priyanka Gandhi in the Parliament and she… pic.twitter.com/UnbfsBxCxg
— Press Trust of India (@PTI_News) January 8, 2025
ఎమర్జెన్సీ సినిమాలో కంగనా రనౌత్..
1975, Emergency — A Defining chapter in Indian History. Indira: India’s most powerful woman. Her ambition transformed the nation, but her #EMERGENCY plunged it into chaos.
🎥 #EmergencyTrailer Out Now! https://t.co/Nf3Zq7HqRx pic.twitter.com/VVIpXtfLov
— Kangana Ranaut (@KanganaTeam) January 6, 2025
కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.