Tollywood: ఈ హ్యాండ్సమ్ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా? బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా..
ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో బాగా క్రేజ్ ఉన్న విలన్లలో జాన్ కొక్కెన్ కూడా ఒకరు. రవితేజ డాన్ శీనుతో మొదలెట్టి మొన్నటి బాలకృష్ణ వీర సింహారెడ్డి దాకా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు జాన్.
కేరళకు చెందిన అనీష్ జానీ కొక్కెన్ ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే నటించాడు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించాడు. రవితేజ డానుశీను సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన జాన్ తీన్ మార్, అధినాయకుడు, దరువు, ఎవడు, నేనొక్కడినే, బాహుబలి, సర్దార్ గబ్బర్ సింగ్, జనతా గ్యారేజ్, రాజా ది గ్రేట్, కేజీఎఫ్ ఛాప్టర్ 1,2, వెంకీ మామ, మహర్షి, వీర సింహారెడ్డి తదితర సూపర్ హిట్ సినిమాల్లో వివిధ పాత్రల్లో మెరిశాడు. ముఖ్యంగా ఆర్య నటించిన సార్పట్ట సినిమాలో జాన్ కొక్కెన్ నటనకు మంచి పేరు వచ్చింది. చివరిగా ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమాలో కనిపించిన జాన్ త్వరలోనే విశాల్ మదగజరాజ సినిమాతో మనల్ని పలకరించేందకు సిద్ధమయ్యాడు. సినిమాల సంగతి పక్కన పెడితే జాన్ కొక్కెన్ రెండు సార్లు వివాహం చేసుకున్నాడు. మొదట 2016లో నటి మీరా వాసుదేవన్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి బాబు కూడా పుట్టాడు. అయితే 2019 వీరు విడాకులు తీసుకున్నారు.
విడాకుల తర్వాత టాలీవుడ్ కు చెందిన ఒక నటితో ప్రేమలో పడ్డాడు జాన్. ఆమె మరెవరో కాదు పూజ రామచంద్రన్. ఇలా పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ స్వామి రారా సినిమాలో కర్లీ హెయిర్ తో నిఖిల్ గ్యాంగ్ లో ఒక అమ్మాయి చూడచక్కగా ఉంటుంది. అంతేకాదు తన ఎక్స్ ప్రెషన్స్ తో అందరినీ కట్టిపడేస్తుంటుంది. స్వామిరారా సినిమాతో పూజ రామచంద్రన్ కు మంచి పేరు వచ్చింది.
భర్త, బిడ్డతో నటి పూజా రామచంద్రన్..
View this post on Instagram
లవ్ ఫెయిల్యూర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది పూజ. ఆ తర్వాత స్నేహితుడు, పిజ్జా, డి కంపెనీ, దోచెయ్, త్రిపుర, దళం, సిద్ధార్థ, ఇంతలో ఎన్నెన్ని వింతలో, వెంకీ మామా, కృష్ణార్జున యుద్ధం, పవర్ ప్లే, ఇప్పుడు కాక ఇంకెప్పుడు, రిపీట్, మై నేమ్ ఈజ్ శ్రుతి తదితర తెలుగు సినిమాల్లో నటించింది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లోనూ సందడి చేసిందీ అందాల తార.
జాన్, పూజల రొమాంటిక్ ఫొటోస్..
View this post on Instagram
2019లో జాన్, పూజా రామచంద్రన్ లు వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక బాబు ఉన్నాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.