Sreeleela: ఆ స్టార్ హీరో కుమారుడితో శ్రీలీల చెట్టపట్టాల్.. అసలు విషయం ఇదే
ప్రస్తుతం టాలీవుడ్ లో ది మోస్ట్ క్రేజీ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు శ్రీలీల. ఆ మధ్యన వరుసగా ఫ్లాప్ లు ఎదురైన అల్లు అర్జున్ పుష్ప 2 సాంగ్ తో మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసిందీ అందాల తార.
శ్రీలీల ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్. ప్రస్తుతం పలు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార. ఈ కారణంగా డేట్స్ అడ్జస్ట్ చేయలేక శ్రీలీల కొంతమంది పెద్ద నటీనటుల సినిమాలకు నో చెప్పాల్సి వచ్చింది. తాజాగా ఆమె అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. ముందుగా ఈ పాట కోసం స్టార్ నటీమణులు లైన్ లోకి వచ్చారు. అయితే చివరికి శ్రీలీల ఎంపిక కావడం ఆమె పాపులారిటీకి నిదర్శనం. ఇప్పుడు శ్రీలీల బాలీవుడ్‌లో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఓ స్టార్ నటుడి డెబ్యూ సినిమాలో ఆమె హీరోయిన్ గా యాక్ట్ చేసేందుకు రెడీ అయ్యింది. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇందుకోసం గత రెండేళ్ల నుంచి నటనలో శిక్షణ తీసుకుంటున్నాడీ స్టార్ కిడ్. కాగా ఇబ్రహీం ఖాన్ సరసన బాలీవుడ్ ప్రేక్షకులకు, యువతకు కొత్త ముఖాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైంది. ఇబ్రహీం ఖాన్, శ్రీలీల ఇటీవల మూవీ ప్రొడక్షన్ ఆఫీస్ వెలుపల కలిసి కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
‘స్త్రీ 2’తో సహా బాలీవుడ్‌కి కొన్ని బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన మాడ్ డాక్ ప్రొడక్షన్ కంపెనీ కార్యాలయం వెలుపల శ్రీలీల, ఇబ్రహీం ఖాన్ కనిపించారు. కామెడీ కలగలిసిన ప్రేమకథగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. అలాగే కొన్ని థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని అంటున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. మాడ్‌డాక్ ప్రొడక్షన్ కంపెనీ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తుందని సమాచారం.
సైఫ్ అలీఖాన్ కుమారుడితో శ్రీలీల..
Sreelela with Ibrahim Ali Khan😍#Sreeleela #IbrahimAliKhan #Actresssreelela #Ibrahim #Bollywood #gemcinemas pic.twitter.com/wYZpGRUaOg
— Gem cinemas (@GemCinemas) January 8, 2025
శ్రీలీల ముందుగా ఓ బాలీవుడ్ సినిమాలో నటించాల్సి ఉంది. వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటిస్తుండగా, శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే డేట్స్ ప్రాబ్లమ్ వల్ల ఆ సినిమా మరో నటికి వెళ్లింది. ప్రస్తుతం శ్రీలీల రవితేజ నటిస్తున్నసినిమాతో పాటు, నితిన్ ‘రాబిన్ హుడ్’, శివకార్తికేయన్ నటిస్తున్న కొత్త తమిళ చిత్రం, పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాల్లో నటిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి