IRDAI Data: కొండలా పేరుకుపోతున్న నాన్-క్లెయిమ్ సొమ్ము.. ఎల్ఐసీదే పెద్ద వాటా

భారతదేశంలో మధ్యతరగతి ప్రజల సంఖ్య సాధారణంగానే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారికి ఆర్థిక అత్యవసర సమయంలో భరోసా ఉండడంతో పాటు కుటుంబ పెద్ద చనిపోతే కుటుంబం వీధిన పడకుండా కొన్ని జీవిత బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇలాంటి బీమా సంస్థల్లో అన్‌క్లెయిమ్‌డ్ సొమ్ము కొండలా పేరుకుపోయింది. ఈ మేరకు ఐఆర్‌డీఏఐ ఇటీవల ఓ నివేదిక వెల్లడైంది.

IRDAI Data: కొండలా పేరుకుపోతున్న నాన్-క్లెయిమ్ సొమ్ము.. ఎల్ఐసీదే పెద్ద వాటా
Lic
Follow us
Srinu

|

Updated on: Jan 09, 2025 | 3:43 PM

ఐఆర్‌డీఏఐ  2023-24 వార్షిక నివేదిక ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ మొత్తం రూ. 22,237 కోట్లుగా ఉంది. గ్లోబల్ డేటా విశ్లేషణ ప్రకారం 2018-19 నుంచి 2022-23 వరకు ఎల్ఐసీ వాటా 90 శాతానికి పైగా ఉంది. మార్చి 31, 2024 నాటికి, భారతీయ జీవిత బీమా రంగం రూ. 20,062 కోట్ల నాన్-క్లెయిమ్ మొత్తాన్ని కలిగి ఉందని వెల్లడైంది. నాన్-క్లెయిమ్ మొత్తం అంటే బీమా పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత కూడా పాలసీదారు లేదా వారి కుటుంబం తీసుకోని మొత్తం అని అర్థం. ఐఆర్‌డీఏఐ   బ్యాంక్ ఇన్సూరెన్స్ లేదా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వంటి ఇతర ఛానెల్‌ల కంటే ఏజెంట్ల ద్వారా విక్రయించే పాలసీలు ఎక్కువ క్లెయిమ్ చేయని మొత్తాన్ని కలిగి ఉన్నాయని 2024 విశ్లేషణలో పేర్కొన్నారు. 

గ్లోబల్ డేటా అనాలిసిస్ ప్రకారం 2018-19 నుంచి 2022-23 వరకు ఎల్ఐసీ మొత్తం నాన్-క్లెయిమ్ మొత్తంలో 90 శాతానికి పైగా ఉంది. ఎల్ఐసీ 64.02 శాతం మార్కెట్ వాటాతో భారతీయ జీవిత బీమా రంగంలో అగ్రగామిగా కొనసాగుతోంది. ఐఆర్‌డీఏఐ  ఫిబ్రవరి 16, 2024న క్లెయిమ్ చేయని మొత్తాలపై మాస్టర్ సర్క్యులర్‌కు మార్పులు చేసింది అన్‌క్లెయిమ్ చేయని మొత్తానికి సంబంధించిన నిర్వచనం, దాని పంపిణీకి సంబంధించిన విధానాలను స్పష్టం చేసింది.

పాలసీదారులు తమ పాలసీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, డబ్బు చిక్కుకోకుండా ఉండేందుకు దానిని వారి కుటుంబ సభ్యులతో పంచుకోవాలని సూచించారు. ఐఆర్‌డీఏఐ వెబ్‌సైట్ లేదా బీమా కంపెనీని సందర్శించడం ద్వారా లేదా వారి హెల్ప్‌లైన్ నుంచి బీమా పాలసీ సమాచారాన్ని పొందవచ్చు. మీ పాలసీకి సంబంధించిన ఏదైనా మొత్తం నిలిచిపోతే వెంటనే మీ బీమా కంపెనీని సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే సరైన పత్రాలను అందించడం ద్వారా మీ క్లెయిమ్‌ను సమర్పించాలని నిపునులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి