గుడ్డు ఉడికించేటప్పుడు మీరూ ఈ తప్పులు చేస్తున్నారా?

09 January 2025

TV9 Telugu

TV9 Telugu

ఇతర అల్పాహారాల్లో లభించని పోషకాలు కోడిగుడ్డులో ఉంటాయి. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు.. ఇవన్నీ ఇందులో పుష్కలంగా లభిస్తాయి

TV9 Telugu

అందుకే పిల్లలకు అందించే ఆహారంలో కోడిగుడ్డు తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో ఉండే విటమిన్ ఎ, ల్యూటిన్, జియాక్సాంథిన్.. లాంటి యాంటీఆక్సిడెంట్లు కంటి సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతాయి

TV9 Telugu

గుడ్లు పోషకాహారంతో నిండి ఉంటాయి. ఒక పెద్ద గుడ్డు తినడం వల్ల 6 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. ఇది కండరాల బలాన్ని పెంచుతుంది. అందుకే చాలా మంది ప్రజలు అల్పాహారంలో గుడ్లు తినడానికి ఇష్టపడతారు

TV9 Telugu

అయితే గుడ్లు సరిగ్గా ఎలా ఉడికించాలో చాలా మందికి తెలియదు. దీంతో ఉడికించేటప్పుడు గుడ్లు పగిలిపోయి విరిగిపోతుంటాయి. ఇలా జరగకుండా ఉండలంటే కొన్ని ముఖ్య జాగ్రత్తలు తీసుకోవాలి

TV9 Telugu

గుడ్లను వాడే ముందు, వాటి గడువు తేదీని తెలుసుకోవడం చాలా ముఖ్యం. రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన గుడ్లను ప్యాకింగ్ తేదీ నుంచి 3 నుంచి 5 వారాల మధ్య వినియోగించాలి

TV9 Telugu

ఉడికించిన గుడ్లను తినాలనుకుంటే, వాటిని వెంటనే ఫ్రిజ్ నుంచి బయటకు తీసిన వెంటనే ఉడకబెట్టకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే గుడ్డు ఉడికించేటప్పుడు తక్కువ మంట మీద మాత్రమే ఉడికించాలి

TV9 Telugu

అధిక మంట మీద ఉడికించడం వల్ల పోషకాలు తగ్గుతాయి. నీరు మరిగే సమయంలో మంటను తగ్గించాలి. ఇక గుడ్లు వేయించేటప్పుడు నూనె వేడిచేయకుండా ఉడికించకూడదని గుర్తుంచుకోండి

TV9 Telugu

ముందుగా నూనెను తక్కువ మంట మీద వేడి చేయాలి. నూనె పసుపు వాసన వచ్చినప్పుడు మాత్రమే గుడ్లను అందులో వేయాలి. గుడ్లు వండేటప్పుడు, ముడి నూనెలో ఉడికించకూడదు. అందులో ఏవైనా కూరగాయల ముక్కలు కూడా జోడించాలి. ఇలా చేయడం వల్ల గుడ్డులోని పోషకాలు పెరుగుతాయి