Vande bharat express: సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. తొలిసారిగా చిత్రీకరించిన దర్శకుడు ఇతడే

వందే భారత్ రైలు అంటే దేశంలో అందరికీ సుపరిచితమే. అత్యంత వేగంగా ప్రయాణం చేసే ఈ రైలులో ఆధునిక సౌకర్యాలు దీనిలో కల్పించారు. వందే భారత్ తొలి రైలును 2019లో ప్రారంభించారు. కొద్ది కాలంలోనే ఇవి ప్రయాణికుల ఆదరణ పొందాయి. అనంతరం మెట్రో, స్లీపర్ క్లాసులకు సంబంధించి కూడా వందే భారత్ రైళ్లు వచ్చేశాయి.

Vande bharat express: సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. తొలిసారిగా చిత్రీకరించిన దర్శకుడు ఇతడే
Vande Bharat
Follow us
Srinu

|

Updated on: Jan 09, 2025 | 4:30 PM

వందే భారత్ రైలును తొలిసారిగా సినిమా షూటింగ్ కు కోసం అందించారు. అవార్డు విన్నింగ్ ఫిల్మ్ మేకర్, నిర్మాత, దర్శకుడు అయిన షూజిత్ సిర్కార్ తన కొత్త సినిమా కోెసం ఈ రైలుపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో వందే భారత్ రైలును తొలిసారి షూటింగ్ కోసం వినియోగించుకున్న వ్యక్తిగా ఆయన పేరు పొందారు. ముంబై సెంట్రల్ స్టేషన్ లో బుధవారం (డిసెంబర్ 8) షూజిత్ సిర్కార్ షూటింగ్ చేశారు. దానిలో భాగంగా స్టేషన్ లోని ఐదో నంబర్ ప్లాట్ ఫాంపై జరిపిన చిత్రీకరణలో వందే భారత్ రైలును ఉపయోగించారు. దీనిలో అనేక సన్నివేశాలను చిత్రీకరించారు. ముందుగా ముంబై – అహ్మదాబాద్ మార్గంలో నడిచే రెండు వందే భారత్ రైళ్లలో ఒకటి బుధవారం తిరగదని ప్రయాణికులకు వెస్ట్రన్ రైల్వే (డబ్ల్యూ ఆర్) అధికారులు తెలియజేశారు. అనంతరం రైల్వే స్టేషన్ లో షూటింగ్ చేశారు.

షూటింగ్ ల ద్వారా రైల్వేకి భారీగా ఆదాయం వస్తుంది. ఇలాంటి వాటిని నాన్ ఫేర్ బాక్స్ ఆదాయం అని పిలుస్తారు. వెస్ట్రన్ రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సినిమాల చిత్రీకరణ ద్వారా ఎక్కువ మొత్తంలో సంపాదిస్తోంది. ప్రస్తుతం జరిగిన వందే భారత్ రైలు చిత్రీకరణతో దాదాపు రూ.23 లక్షల రూపాయలు వచ్చినట్టు తెలుస్తోంది. సినిమాలకు, రైలుకు అవినాభావ సంబంధం ఉంది. ప్రతి సినిమాలోనూ రైలుకు సంబంధించిన సన్నివేశం తప్పకుండా కనిపిస్తుంది. ఫైట్, హీరో హీరోయిన్ల పాటలు, హీరో స్నేహితుల కామెడీ, విలన్ల ఎంట్రన్స్.. ఇలా చాలా సన్నివేశాలు రైల్వే స్టేషన్లలో చిత్రీకరిస్తారు. రైలు కనిపించని సినిమాలు దాదాపు ఉండవని చెప్పవచ్చు. కొన్ని సినిమాలైతే మొత్తం రైలులోనే కొనసాగుతాయి. వాటిలో రైల్వే మెన్, గ్యాస్ లైట్, హీరోపంతి 2, బ్రీత్ ఇన్ టు షాడోస్, ఓఎంజీ 2, బేబీ డాల్, ఏక్ విలన్ రిటర్న్స్ తదితర వాటిని వెస్ట్రన్ రైల్వేస్ ఆధ్వర్యంలో చిత్రీకరించారు.

డైరెక్టర్ షూజిత్ సిర్కార్ సినిమాలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. కథ, కథనం, పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులను హత్తు కుంటాయి. ఆయన బాలీవుడ్ లో నిర్మాత, దర్శకుడిగా మంచి పేరు పొందారు. మూడు జాతీయ చలన చిత్ర అవార్డులు, రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. రొమాంటిక్ వార్ డ్రామా యహాన్ తో ఆయన దర్శకుడిగా ప్రవేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి