AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anti-Cancer Diet: ఈ వెజిటబుల్‌ తీసుకుంటే క్యాన్సర్‌ ముప్పు జన్మలో రాదు.. ఆరోగ్యానిక సంపూర్ణ రక్ష

సాధారణంగా అన్ని ఇళ్లలోని వంగ గదుల్లో ఉపయోగించే కూరగాయలలో టొమాటో ఒకటి. ఇందులో విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, విటమిన్-కె పుష్కలంగా ఉంటాయి. టొమాటో అన్ని రకాల వంటలకు ప్రత్యేక రుచిని అందించడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో ఉండే వివిధ పోషకాలు..

Anti-Cancer Diet: ఈ వెజిటబుల్‌ తీసుకుంటే క్యాన్సర్‌ ముప్పు జన్మలో రాదు.. ఆరోగ్యానిక సంపూర్ణ రక్ష
Anti Cancer Diet
Srilakshmi C
|

Updated on: Oct 06, 2024 | 7:21 PM

Share

సాధారణంగా అన్ని ఇళ్లలోని వంగ గదుల్లో ఉపయోగించే కూరగాయలలో టొమాటో ఒకటి. ఇందులో విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, విటమిన్-కె పుష్కలంగా ఉంటాయి. టొమాటో అన్ని రకాల వంటలకు ప్రత్యేక రుచిని అందించడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో ఉండే వివిధ పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. అధిక రక్తపోటుకు గురయ్యే వారు కూడా ఎలాంటి భయం లేకుండా ఈ కూరగాయలను తీసుకోవచ్చు. టొమాటోలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు పెరగదు. ఈ కూరగాయలను తీసుకోవడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఇక్కడ తెలుసుకోండి..

చర్మానికి మేలు చేసే టమాట

మనం రోజూ తీసుకునే ఆహారంలో టమోటా చేర్చుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. టమోటాలు తినడం వల్ల చర్మానికి మేలు జరుగుతుంది. ఇంతులో తక్కువ క్యాలరీలు, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల శరీర ఆరోగ్యానికి ఇది మంచి ఆహారం అని నిపుణులు చెబుతున్నారు. టమాటాలను రెగ్యులర్‌గా తింటే వాటిలోని పీచు పదార్థం ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది. తద్వారా ఆరోగ్యానికి హాని కలిగించే చిరుతిళ్లు తినడానికి అవకాశం ఉండదు.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

టమాటాలో లైకోపీన్, పొటాషియం, విటమిన్ సి బిపిని నియంత్రించడంలో ఉంచుతుంది. ధమనుల పనితీరును మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడతాయి. ఇందులోని లైకోపీన్ కొన్ని రకాల క్యాన్సర్‌లను తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. టమాటాలో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ కణితుల పెరుగుదలను నిరోధిస్తుంది. అలాగే టమాటాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. టమాటా చర్మాన్ని రక్షించడానికి చాలా ఉపయోగపడుతుంది. టమోటాలలోని పోషకాలు ‘ఫ్రీ రాడికల్స్’ తటస్థీకరించడం ద్వారా, సెల్యులార్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆరోగ్యానికి మంచిది కదా అని మరీ ఎక్కువగా తీసుకోకుండా తటస్థంగా తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us