Water Spinach: ఈ నీటి పాలకూర ఎక్కడ కనిపించినా.. విడిచి పెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి..
ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఆకు కూరల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటాయి. చాలా మంది వీటికి దూరంగా ఉంటారు. కానీ తమ ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా అన్ని రకాల ఆకు కూరలు తీసుకుంటూ ఉంటారు. సరిగ్గా తీసుకోవాలే కానీ.. శరీరానికి అవసరం అయిన పోషకాలన్నీ ఆకు కూరల్లో లభిస్తాయి. ఇప్పుడు చెప్పబోయే ఆకు కూర..

ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఆకు కూరల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటాయి. చాలా మంది వీటికి దూరంగా ఉంటారు. కానీ తమ ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా అన్ని రకాల ఆకు కూరలు తీసుకుంటూ ఉంటారు. సరిగ్గా తీసుకోవాలే కానీ.. శరీరానికి అవసరం అయిన పోషకాలన్నీ ఆకు కూరల్లో లభిస్తాయి. ఇప్పుడు చెప్పబోయే ఆకు కూర అనేది కాస్త అరుదు. దీన్ని ఎక్కడ కనిపించినా వెంటనే ఇంటికి తెచ్చుకోండి. ఈ ఆకు కూరతో ఎన్నో రకాల సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. ఇది కూడా పాల కూర మాదిరిగానే ఉంటుంది. కానీ ఆకులు మాత్రం చాలా పొడుగ్గా ఉంటాయి. ఈ నీటి ఆకు కూర చాలా మందికి తెలీదు. మార్కెట్లో చాలా తక్కువగా కనిపిస్తుంది. ఆయుర్వేద పరంగా చూస్తే ఈ ఆకు కూర మనకు వరం అనే చెప్పాలి. మరి ఈ నీటి ఆకు కూర తీసుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
పచ్చ కామెర్ల సమస్య తగ్గుతుంది:
చాలా మంది పచ్చ కామెర్ల సమస్యతో బాధ పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ నీటి పాలకూర తింటే చాలా త్వరగా కోలుకుంటారు. నీటి పాలకూర తినడం వల్ల కూడా ఈ సమస్య రాదు.
డయాబెటీస్ కంట్రోల్:
నీటి పాలకూరలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి డయాబెటీస్‌తో బాధ పడేవారు ఈ పాల కూర తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి.
రక్త హీనత సమస్య దూరం:
ఈ నీటి ఆకు కూరలో ఐరన్ అనేది అధికంగా ఉంటుంది. రక్త హీనత సమస్య ఉన్నవారు దీన్ని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అంతే కాకుండా సర్జరీలు అయిన వారు, గర్భిణీలు ఈ ఆకు కూర తీసుకుంటే చాలా మంచిది. వారంలో ఒక్కసారి తిన్నా రక్త హీనత సమస్య రాదు.
కొలెస్ట్రాల్ కంట్రోల్:
అధిక కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడేవారు నీటి పాల కూర తీసుకోవడం వల్ల కడిగేసినట్లు క్లీన్ అవుతుంది. రక్తంలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉన్నా కరిగిపోతుంది. కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడేవారు నీటి పాల కూర తింటే చాలా మంచిది.
గుండె ఆరోగ్యం:
నీటి పాలకూరను మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యం అనేది మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ అనేది రాకుండా చూసుకోవచ్చు. గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)








