వర్షాకాలంలో తినకూడనవి ఇవే.. వైద్యనిపుణుల కీలక సూచనలు..

వర్షాకాలం వచ్చేసింది చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉంటుంది. ఇక కాలువలు, డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. హైదరాబాదులో అయితే చెప్పనవసరం లేదు ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోవడంతో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఇలాంటి సమయంలో కొన్ని రకాలైన ఆహార పదార్థాలు తింటే రోగాల బారిన పడటం ఖాయం అంటున్నారు వైద్యులు.

వర్షాకాలంలో తినకూడనవి ఇవే.. వైద్యనిపుణుల కీలక సూచనలు..
Rainy Season
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 22, 2024 | 4:50 PM

వర్షాకాలం వచ్చేసింది చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉంటుంది. ఇక కాలువలు, డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. హైదరాబాదులో అయితే చెప్పనవసరం లేదు ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోవడంతో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఇలాంటి సమయంలో కొన్ని రకాలైన ఆహార పదార్థాలు తింటే రోగాల బారిన పడటం ఖాయం అంటున్నారు వైద్యులు. వర్షాకాలంలో ఎటువంటి ఫుడ్ తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాము.

వర్షం వచ్చిందంటే చాలు ఈగలు దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో జలుబు, ఫ్లూ, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్ వంటి సమస్యలు వస్తాయి. కొన్ని రకాల వ్యాధులు దోమల ద్వారా వస్తే మరికొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మనం తినే ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రోగాలు బారిన పడక తప్పదంటున్నారు వైద్య నిపుణులు. సహజంగా వర్షాకాలం సీజన్లో బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ది చెందుతాయి. ఈ కాలంలో కొన్ని ఆహారాలు అనారోగ్యానికి గురిచేస్తాయి. వీటికి వీలైనంత దూరంగా ఉండాలని చెప్తున్నారు వైద్యులు.

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వర్షాకాలంలో వాటిని తినడం తగ్గించాలి. ఎందుకంటే ఈ సీజన్లలో ఆకుకూరలు పండించే ప్రదేశాలు అపరిశుభ్రంగా మారుతాయి. చిత్తడి నేలల్లో వీటిని పండిస్తారు కనుక వీటిపై సరైన శ్రద్ధ తీసుకోరు. ఆకుకూరలకు బురద అంటుకొని ఉంటుంది. అప్పుడు బ్యాక్టీరియా వాటిపై చేరి అనేక సీజన్ వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో బ్రోకలీ, క్యాబేజీ క్యాలీఫ్లవర్ వంటి వెజిటబుల్స్‎పై పురుగులు ఉండే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటాయి. తడి వాతావరణంలో క్యాబేజీ ఉంటే ఆ కూరల్లో బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఉంటాయి. వాటిని తినడం వల్ల అనేక వ్యాధుల బారినపడే అవకాశం ఉంటుందంటున్నారు డాక్టర్లు.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్