AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తినకపోతే అద్బుతాలను మిస్సయినట్లే.. ఆ సమస్యలకు దివ్యౌషధం.. కొలెస్ట్రాల్‌ను సర్ఫ్ వేసి కడిగేసినట్లే..

ఉల్లిపాయే కదా అని చాలా మంది లైట్ తీసుకుంటారు.. కానీ.. ఉల్లిపాయల్లో పోషకాలతోపాటు ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. అందుకే.. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు.. ఉల్లిపాయల్లోని పోషకాలు, ఔషధ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే, ఉల్లిపాయను పోషకాల గనిగా పేర్కొంటారు.

తినకపోతే అద్బుతాలను మిస్సయినట్లే.. ఆ సమస్యలకు దివ్యౌషధం.. కొలెస్ట్రాల్‌ను సర్ఫ్ వేసి కడిగేసినట్లే..
White Onion
Shaik Madar Saheb
|

Updated on: Aug 01, 2025 | 7:53 PM

Share

ఉల్లిపాయే కదా అని చాలా మంది లైట్ తీసుకుంటారు.. కానీ.. ఉల్లిపాయల్లో పోషకాలతోపాటు ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. అందుకే.. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు.. ఉల్లిపాయల్లోని పోషకాలు, ఔషధ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే, ఉల్లిపాయను పోషకాల గనిగా పేర్కొంటారు. ఉల్లిపాయల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.. కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే.. దీనిని సూపర్‌ఫుడ్‌గా పేర్కొంటారు. ఉల్లిపాయలు లేకుండా ఏ కూర కూడా రుచిగా ఉండదు. ఉల్లి లేకుండా అసలు కూరనే వండరు.. వంటింట్లో ఏది లేకపోయినా.. ఉల్లి ఉండాల్సిందే.. ఇంకా ఉల్లిని సలాడ్‌లో కూడా ఉపయోగిస్తారు. ఉల్లిపాయలు రెండు రకాలుగా ఉంటాయి.. ఎర్ర ఉల్లిపాయలు, తెల్ల ఉల్లిపాయలు..

ఎర్ర ఉల్లిపాయలు లానే.. తెల్ల ఉల్లిపాయల్లో కూడా ఎన్నో పోషకాలు దాగున్నాయి. సాధారణంగా ఎర్ర ఉల్లిపాయల కంటే.. తెల్ల ఉల్లి ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందంటున్నారు డైటీషియన్లు.. ఉల్లిపాయలో విటమిన్ సి, విటమిన్ బి6, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, భాస్వరం, జింక్, రాగి, సెలీనియం, కోలిన్, ఇతర ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.. తెల్ల ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకోండి..

తెల్ల ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది: తెల్ల ఉల్లిపాయ అనేక సమస్యలను దూరం చేస్తుంది. ఈ ఉల్లిపాయను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థను బలంగా మారుతుంది. ఇందులోని ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉల్లిపాయలోని ప్రీబయోటిక్ పొట్టను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

జుట్టు సమస్యలు: తెల్ల ఉల్లిపాయ మీ జుట్టుకు చాలా మేలు చేస్తుంది. చుండ్రు సమస్యను నివారించేందుకు తెల్ల ఉల్లిపాయ మంచిగా పనిచేస్తుంది. ఉల్లి.. రసాన్ని తలపై అప్లై చేసి కొంత సేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల జుట్టు కూడా దృఢంగా మారుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గేలా చేస్తుంది: తెల్ల ఉల్లిపాయలోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటే.. ప్రతిరోజూ తెల్ల ఉల్లిపాయలను తినడం మంచిది.. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంతోపాటు.. బరువును తగ్గేలా చేస్తుంది.

గుండె ఆరోగ్యం: తెల్ల ఉల్లిపాయ బీపీని నియంత్రిస్తుంది.. ఇది శరీరాన్ని కూల్ చేయడంతోపాటు.. గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిసత్తోంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు..రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..