Chia Seeds: చియా విత్తనాలతో ఇలా కూల్ అవ్వండి.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్!

వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. చలి నెమ్మదిగా పోయి.. నెమ్మది నెమ్మదిగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గత వారం రోజుల నుంచి మధ్యాహ్నం ఉష్ణోగ్రత లెవల్స్‌లో చాలా మార్పులు వచ్చాయి. ఇలా వాతవరణం మారినప్పుడు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే రోగాల బారిన పడక తప్పదు. ఒక్కసారిగా ఎండ వేడి పెరగడం వల్ల అలసటకు, నీరసానికి గురవుతూ ఉంటారు. ఇది ముఖ్యంగా మీ జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. కాబట్టి మీ ఆహారపు..

Chia Seeds: చియా విత్తనాలతో ఇలా కూల్ అవ్వండి.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్!
Chia Seeds
Follow us
Chinni Enni

|

Updated on: Feb 10, 2024 | 1:13 PM

వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. చలి నెమ్మదిగా పోయి.. నెమ్మది నెమ్మదిగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గత వారం రోజుల నుంచి మధ్యాహ్నం ఉష్ణోగ్రత లెవల్స్‌లో చాలా మార్పులు వచ్చాయి. ఇలా వాతవరణం మారినప్పుడు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే రోగాల బారిన పడక తప్పదు. ఒక్కసారిగా ఎండ వేడి పెరగడం వల్ల అలసటకు, నీరసానికి గురవుతూ ఉంటారు. ఇది ముఖ్యంగా మీ జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. కాబట్టి మీ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ప్రస్తుతం శరీరానికి ఎనర్జీ ఇచ్చే ఫుడ్స్, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి. అలాగే వేడి నుంచి ఉపశమనం కూడా కల్పించాలి. ఈ గుణాలు చియా సీడ్స్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఈ చియా గింజలను జ్యూస్‌లు, సలాడ్స్, తాగే నీటిలో ఉపయోగించడం మంచిది. దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో చూసేయండి.

చియా విత్తనాల్లో పోషకాలు:

కేలరీలు, ప్రోటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాలు, ఫైబర్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, విటమిన్లు బి1, బి3లు.

ఎనర్జీ లెవల్స్ పెంచుతుంది:

చియా సీడ్స్‌తో తయారు చేసే ఆహారం లేదా పానీయాలు తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి అనేది పెరుగుతుంది. ఇందులో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, కేలరీల వల్ల శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుంది. అలసట దూరమై.. రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. అంతే కాకుండా శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ కూడా పెరుగుతాయి. దీంతో రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. అంతే కాకుండా ముఖ్యంగా శరీరంలో ఉండే వేడిని తగ్గించి.. బాడీని చల్లబరుస్తుంది.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గుతారు:

వెయిల్ లాస్ అవ్వాలి అనుకునేవారు చియా సీడ్స్ తీసుకోవచ్చు. ఇవి కొద్దిగా తీసుకున్నా.. కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఇతర ఆహార పదార్థాలు తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో పిండి పదార్థాలు, ఫైబర్ ఉంటాయి. ఇది జీర్ణ వ్యవస్థకు చాలా మంచి చేస్తుంది.

మంచి కొలెస్ట్రాల్:

చియా సీడ్స్‌లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది హార్ట్ ఆరోగ్యానికి చాలా మంచింది. అంతే కాకుండా ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అంతే కాకుండా చియా సీడ్స్‌తో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్నవారు ఎలాంటి సందేహం లేకుండా వీటిని తీసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!