మిల్క్‌ షేక్‌ జ్యూస్ అంటే మస్త్‌ ఇష్టమా? మిమ్మల్ని షేక్ చేసే న్యూస్ ఇది.. నిజంగా విషంగా మారుతుందా?

Mango Shake VS Banana Shake: మామిడి, అరటిపండు రెండూ ఆరోగ్యకరమేనా? పండ్ల ప్రకారం చూసుకుంటే ఈ రెండూ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. కానీ పాలతో కలిపి తీసుకునేటప్పుడు మామిడి మాత్రమే మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

మిల్క్‌ షేక్‌ జ్యూస్ అంటే మస్త్‌ ఇష్టమా? మిమ్మల్ని షేక్ చేసే న్యూస్ ఇది.. నిజంగా విషంగా మారుతుందా?
Mango Shake Vs Banana Shake
Follow us
Madhu

|

Updated on: Jun 20, 2023 | 8:00 AM

ఈ ఏడాది లాంగ్‌ సమ్మర్‌ ఇబ్బందులకు గురిచేస్తోంది. విపరీతమైన వేడిమి, ఉక్కపోత, వడగాడ్పులతో జనాలు బెంబేలెత్తుతున్నారు. ఇటువంటి వాతావరణంలో సాధారణంగా శీతల పానీయాలకు డిమాండ్‌ పెరుగుతోంది. వాటిల్లోనూ ఫ్రూట్‌ జ్యూస్‌లు, షేక్స్‌, స్మూతీస్‌ని జనాలు అధికంగా తీసుకుంటుంటారు. ఇవి వేసవిలో శరీరానికి స్వాంతన చేకూర్చుతుండటంతో అందరూ వాటికి మొగ్గుచూపుతున్నారు. అలాగే ఆరోగ్యాన్నిచ్చే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఇతర పోషకాలు శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి రోజూ తీసుకోవడం వల్ల యాక్టివ్ గా ఉంటారు. సాధారణంగా వేసవి అంటే మనకు గుర్తొచ్చే పండు మామిడి. వీటితో కూడా మిల్క్‌ షేక్‌లు తయారు చేస్తున్నారు. అలాగే బననా షేక్‌ కూడా విరివిగా ప్రజలు వినియోగిస్తున్నారు. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్‌. అసలు పాలు అన్ని పండ్లతో కలిపి షేక్స్‌ చేయొచ్చా? ఇదే విషయంపై ఆయుర్వేద నిపుణులు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అన్ని పండ్లతో పాలను మిక్స్‌ చేస్తే ఆరోగ్యమేమో గానీ పలు సమస్యలు వేధిస్తాయని చెబుతున్నారు. స్లో పాయిజన్ గా మారే ప్రమాదం కూడా ఉందని హెచ్చిరిస్తున్నారు.

ఆయుర్వేదం చెబుతోంది ఇదే..

ఆయుర్వేదం ప్రకారం అన్ని పండ్లు పాలతో కలపడం సరికాదు. తీపి, పూర్తిగా పండిన పండ్లు మాత్రమే పాలతో కలిపి షేక్ చేసుకోవడానికి అనువుగా ఉంటాయి. మామిడి, అరటి రెండూ తియ్యగా ఉంటాయి. వీటిని ఎక్కువ మంది బ్రేక్ ఫాస్ట్లో మామిడి, అరటి మిల్క్ షేక్స్ తీసుకోవడానికి ఇష్టం చూపిస్తారు. అయితే నిజానికి ఇవి రెండూ ఆరోగ్యకరమేనా? పండ్ల ప్రకారం చూసుకుంటే ఈ రెండూ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. కానీ పాలతో కలిపి తీసుకునేటప్పుడు మామిడి మాత్రమే మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

అరటి పండు పండు తీపిగా ఉండవచ్చు కానీ జీర్ణక్రియ తర్వాత అది పుల్లగా మారుతుంది. ఇది పాలతో వినియోగానికి పనికి రాదు. అందుకే రెండింటినీ కలపకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మితంగా తీసుకుంటే ఫర్వాలేదని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే పండిన తీపి మామిడిని పాలతో కలపవచ్చు. ఇది పాలతో కలపడం వల్ల వాత, పిత్త దోషాలను శాంతపరుస్తుంది. రుచికరమైనది కూడా. పోషకాలతో నిండి ఉంటుంది. చల్లదనాన్ని కలిగిస్తుంది. అంటే మీరు ఎటువంటి సందేహం పెట్టుకోకుండా మామిడి పండు షేక్ ని తీసుకోవచ్చు. అయితే ఏవైనా దీర్ఘకాలిక పరిస్థితితో బాధపడుతుంటే ఆరోగ్య నిపుణుడి సలహా మేరకు తీసుకోవాలి.

మామిడి vs బనానా షేక్: ఏది మంచిది

పోషక పదార్థాలు, అలాగే బరువు తగ్గడానికి తోడ్పాటును ఇచ్చే విధంగా పోల్చి చూస్తే, మామిడి షేక్ కంటే అరటి షేక్ ఉత్తమం. క్యాలరీ కంటెంట్ పరంగా కూడా, బనానా షేక్ అనేది చాలా ఇష్టపడే ఎంపిక. ఒక సాధారణ గ్లాసు తియ్యని మామిడి షేక్‌లో 170 కేలరీలు ఉంటాయి. అయితే ఒక సాధారణ గ్లాసు తియ్యని బనానా షేక్‌లో 150 కేలరీలు మాత్రమే ఉంటాయి. మీరు మీ క్యాలరీలను తీసుకుంటే, బనానా షేక్ ఉత్తమ ఎంపిక. వ్యాయామం తర్వాత దీన్ని తాగడం వల్ల త్వరగా కోలుకోవచ్చు. కానీ మామిడి షేక్‌లో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీరు దీన్ని కొన్నిసార్లు మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..