మజ్జిగలో ఉప్పు కలిపి తాగుతున్నారా?

Velpula Bharath Rao

31 December 2024

పెరుగు మజ్జిగ ఆర్యోగానికి ఎంతో గాను మేలు చేస్తుంది. ఇందులో విటమిన్-కే2, విటమిన్-డీ, ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.

పెరుగు మజ్జిగ ఆర్యోగానికి ఎంతో గాను మేలు చేస్తుంది. ఇందులో విటమిన్-కే2, విటమిన్-డీ, ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.

ఈ పోషకాలు ఎముకులను బలంగా ఉంచడమే కాకుండా నోటి ఆరోగ్యానికి కూడా మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. అయితే చాలా మంది మజ్జిగ, లేదా పెరుగులో ఉప్పు వేసుకొని తింటారు.

అయితే అలా తినడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.  మజ్జిగలో ఉప్పు వేసుకోవడం వల్ల అలర్జీ వచ్చే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు.

ఉప్పులో సోడియం ఉంటుంది. అయితే ఈ సోడియం కారణంగా అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాస్తవానికి మజ్జిగ తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది కానీ దానిని ఉప్పులో కలిపి తీసుకోవడం వల్ల అది మనకు హానికరంగా మారుతుంది.

మజ్జిగ లేదా  పెరుగులో ఉప్పు కలుపుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతుందని వైద్య నిపుణలు చెబుతున్నారు.

పెరుగులో ఉప్పు కలపడం వల్ల బాడీలో ఉన్న మంచి బ్యాక్టరియా ప్రతికూల ప్రభావితం చూపుతుంది. ఇది కాస్త జీర్ణక్రియపై హానికరమైన ప్రభావం చూపుతుంది.