పల్లీలతో పుట్టెడు లాభాలు.. రోజూ గుప్పెడు తింటే దండిగా జ్ఞాపకశక్తి
01 January 2025
TV9 Telugu
TV9 Telugu
ప్రయాణాల్లో పల్లీలు తింటుంటాం. ఇవి రుచిగానూ ఉంటాయి, ఆరోగ్యాన్నీ ఇస్తాయి. శీతాకాలంలో వేయించిన వేరుశెనగలను సాయంత్రం వేళల్లో స్నాక్స్ మాదిరి తింటుంటే ఆ మజానే వేరు
TV9 Telugu
అందుకే వీటిని వింటర్ బాదం అని కూడా పిలుస్తారు. వేరుశనగపప్పుల్లో క్యాల్షియం, ఐరన్, కాపర్, ఫొలేట్, భాస్వరం, మాంగనీస్, మెగ్నీషియం, బి1, బి3, బి6, ఇ- విటమిన్లు ఉన్నాయి
TV9 Telugu
అంతేకాకుండా వీటిల్లో ఆరోగ్యానికి మేలు చేసే ప్రొటీన్లు, పీచుపదార్థాలతో పాటు క్యాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం మొదలైన ఖనిజాలు కూడా ఉన్నాయి
TV9 Telugu
ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. గుండె జబ్బులను నిరోధిస్తాయి. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తాయి. వీటిలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, ఫాటీ యాసిడ్స్ చర్మాన్ని సంరక్షిస్తాయి
TV9 Telugu
పల్లీల్లోని పోలీ, మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫాట్స్, విటమిన్ బి3లు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. వయసు రీత్యా వచ్చే అల్జీమర్స్ లాంటి సమస్యలను కూడా తగ్గిస్తాయని పరిశోధనల్లో తేలింది
TV9 Telugu
మూడ్స్‌ను క్రమబద్ధంచేసి, యాంటీడిప్రెసెంట్లుగా పనిచేసే ఎమినో యాసిడ్స్ పల్లీలు అందిస్తాయి. నిజానికి పల్లీలు వేడి స్వభావం కలిగి ఉంటాయి. శీతాకాలంలో వీటిని తింటే శరీరం వెచ్చగా ఉంటుంది
TV9 Telugu
కానీ రోజుకు ఒకటిన్నర ఔన్స్ అంటే 42 గ్రాములు మాత్రమే పల్లీలు తినాలి. అతిగా తింటే అనర్ధాలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులోని విటమిన్ ఇ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది
TV9 Telugu
పల్లీల్లో విటమిన్ ఇ కాకుండా, ప్రోటీన్, బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి. అందువల్ల వీటి వినియోగం జ్ఞాపకశక్తికి మేలు చేస్తుంది. ఒమేగా 3 చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. కండరాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది