Hyderabad: న్యూ ఇయర్ వేళ.. హోటల్ కిచెన్‌లోకి వెళ్లిన అధికారులు.. దిమ్మతిరిగే షాక్

ఇయర్‌ మారినా కొందరి తీరు మాత్రం మారట్లేదు. కొత్త సంవత్సరంలోనూ కక్కుర్తి వేషాలే వేస్తున్నారు. న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ను క్యాష్‌ చేసుకునేందుకు... జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇంకా పలు రెస్టారెంట్లు, హోటళ్లు మారలేదు. కస్టమర్ల సేఫ్టీ పట్టలేదు. న్యూఇయర్‌ను క్యాష్‌ చేసుకునే పనిలో మళ్లీ అదే నిర్లక్ష్యం కనిపించింది.

Hyderabad: న్యూ ఇయర్ వేళ.. హోటల్ కిచెన్‌లోకి వెళ్లిన అధికారులు.. దిమ్మతిరిగే షాక్
Food Safety
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 01, 2025 | 5:32 PM

ఒకవైపు వరుస తనిఖీలతో హోటల్స్‌.. రెస్టారెంట్లపై ఉక్కుపాదం మోపుతున్నా.. కొందరు నిర్వహికులు మాత్రం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనే ఉన్నారు. సీజ్‌ చేస్తున్నా.. కఠిన చర్యలు తీసుకుంటున్నా.. రెస్టారెంట్లు, హోటల్స్‌ తీరు ఏమాత్రం మారడంలేదు. హైదరాబాద్‌లో ఎక్కడ తనిఖీలు చేసినా.. అవే కుళ్లిపోయిన పదార్థాలు, కిచెన్స్‌లో అదే అపరిశుభ్ర వాతావరణం దర్శనమిస్తుండడం షాకిస్తోంది. తాజాగా.. మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని పలు రెస్టారెంట్లలో విస్తృత తనిఖీలు చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడంలేదనే ఆరోపణలతో కొంపల్లిలోని ఉలవచారు, మల్నాడు కిచెన్, ట్రైన్ థీమ్ రెస్టారెంట్లలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దాంతో.. కీలక విషయాలు బయటపడ్డాయి.

ఆయా రెస్టారెంట్లలోని కిచెన్స్‌లో కుళ్లిన పదార్థాలు, బొద్దింకలు కనిపించాయి. నాన్‌-వెజ్‌ ఐటమ్స్‌లో సింథటిక్‌ కలర్స్‌ వాడుతున్నట్లు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తేల్చారు. బటర్‌ అప్లై చేసేందుకు పెయింట్‌‌ బ్రష్‌ వాడుతుండడం చూసి షాకయ్యారు. కుళ్లి కంపు కొడుతున్న టమాటాలు, ఎక్స్‌పైర్‌ అయిన పదార్థాలను వంటల్లో వాడుతున్నట్లు గుర్తించారు. తుప్పు పట్టిన ఫ్రిడ్జిలో ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేయడంతోపాటు.. ఒకే ఫ్రిడ్జ్‌లో వెజ్‌, నాన్‌ వెజ్‌ను నిల్వ చేస్తుండడపై సీరియస్‌ అయ్యారు. రెస్టారెంట్‌లోని కుళ్లిన పదార్థాల నుంచి శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపారు. తనిఖీలు పూర్తయిన తర్వాత.. కుళ్లిన పదార్థాలను డస్ట్‌ బిన్స్‌లో వేయించి.. ఎక్స్‌పైరీ అయిన ప్రొడక్ట్స్‌ను సీజ్‌ చేశారు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?