Fish Venkat: ఫిష్ వెంకట్ భావోద్వేగం.! పవన్ కల్యాణ్ ఆర్థిక సాయంపై వీడియో.
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరం కావడంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందరో ప్రముఖ నటులతో కలిసి యాక్ట్ చేశారు ఫిష్ వెంకట్.
పవన్‌ను కలిసి, తన అనారోగ్య సమస్యను వివరించడంతో వెంటనే అన్ని విధాలా సహాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారని వెంకట్ తెలిపారు. అలాగే తన ఆర్థిక ఇబ్బందులను గమనించి తన బ్యాంకు ఖాతాలో వెంటనే రూ. 2 లక్షలు జమ చేయించారని వెంకట్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఎప్పుడూ ఎవరినీ ఏమీ అడగలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పవన్‌ని కలిసానన్నారు. తనను ఈ కష్టకాలంలో ఆదుకున్న పవన్ కల్యాణ్, ఆయన కుటుంబం ఎప్పుడూ ఆనందంగా ఉండాలని దేవుడ్ని కోరుకున్నట్టు ఫిష్ వెంకట్ తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.