Sandhya Theater Issue: సంధ్యా థియేటర్ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ8గా పుష్ప2 నిర్మాతలు ఉన్నారు. ఈ ఘటనలో వారి ప్రమేయం కూడా ఉందంటూ వారిని పోలీసులు ఈ కేసులో చేర్చారు. అయితే పోలీసులు ఛార్జ్ షీట్ లో ఏ8గా తమ పేరును ఎంట్రీ చేయడం పై కోర్టుమెట్లెక్కారు నిర్మాతలు. ఈ కేసులో వారికి రిలీఫ్ లభించింది.
సంధ్య థియేటర్ ఘటనపై తమ మీద నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పుష్ప-2 నిర్మాతలు రీసెంట్‌గా పిటిషన్ దాఖలు చేశారు. థియేటర్ భద్రత తమ పరిధి కాదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. తమ బాధ్యతగా ముందే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. అలా ఇన్ ఫర్మేషన్ ఇచ్చాం కాబట్టే అంత మంది పోలీసులు అక్కడ ఉన్నారని ప్రొడ్యూసర్లు తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జరిగిన ఘటనకు సినిమా ప్రొడ్యూసర్లను నిందితులుగా చేరిస్తే ఎలా అని… పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. దీంతో సినిమా ప్రొడ్యూసర్లను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాదు దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. దీంతో పుష్పా-2 ప్రొడ్యూసర్స్ కు హైకోర్టులో ఊరట లభించినట్టైంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

