KTR: అదొక లొట్టపీసు కేసు.. కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
కేసీఆర్‌ను మరోసారి సీఎంను చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.. తమ పాత్ర తాము పోషిస్తున్నామని.. కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడూ రావాలో అప్ప్పుడే వస్తారంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫార్ములా–ఈ రేసు కేసు వ్యవహారంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్‌ను మరోసారి సీఎంను చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.. తమ పాత్ర తాము పోషిస్తున్నామని.. కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడూ రావాలో అప్ప్పుడే వస్తారంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫార్ములా–ఈ రేసు కేసు వ్యవహారంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడిన కేటీఆర్.. ఫార్ములా ఈకేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దామంటూ పేర్కొన్నారు. అవినీతే లేనప్పుడు.. కేసు ఎక్కడదన్నారు.. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు అని.. 7న ఈడీ విచారణకు హాజరుపై తమ లాయర్లు నిర్ణయిస్తారన్నారు. ఏసీబీ కేసులో అస్సలు పస లేదని.. తనకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందన్నారు.. ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసని.. పాపం.. తనను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. తనపై ఇది ఆరో ప్రయత్నమని… రేవంత్ కు ఏమి దొరకటం లేదంటూ వ్యాఖ్యానించారు.
600కోట్లు సంగతి అటుంచితే.. ఒక్క పైసా కూడా అవినీతి లేదని కేటీఆర్ పేర్కొన్నారు. జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానమే లేదన్నారు.. రేసు కావాలని తాను నిర్ణయం తీసుకున్నా.. వద్దనేది రేవంత్ నిర్ణయమన్నారు.. ఇద్దరి నిర్ణయాలపై క్యాబినెట్ లో చర్చ జరగలేదన్నారు. తనపై కేసు పెడితే.. రేవంత్ పై కూడా కేసు పెట్టాలంటూ వ్యాఖ్యానించారు..
కేసీఆర్ అప్పుడే వస్తారు..
ప్రస్తుతం తమ పాత్ర తాము పోషిస్తున్నామని.. కేసీఆర్ ప్రజల్లో ఎప్పుడూ రావాలో అప్పుడే వస్తారంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ చెప్పారు.. ఓడిపోతే ఏంటా అని.. స్పీకర్ బాధ్యత కేసీఆర్ కి ఫోన్ చేయడమంటూ కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పై సంక్రాంతి తరువాత సుప్రీంకోర్టు కి వెళ్తామన్నారు. ఈ సంవత్సరం ఉప ఎన్నికల రావొచ్చని.. RRRలో 12 వేల కోట్ల కుంభకోణం జరుగబోతుందంటూ ఆరోపించారు.. ఖాజా గూడ లో ఉన్న పేద వాళ్ళను రోడ్ పై వేశారని.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటూ కేటీఆర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నుంచి ఇప్పటికే ముఖ్యమంత్రికి తిట్లు పడ్డాయని.. లక్ష 38 వేల కోట్ల అప్పులో వేల కోట్ల రూపాయలు ఢిల్లీకి పోతున్నాయని.. పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల తో డబ్బులు వసూలు చేసి ఢిల్లీ కి పంపుతున్నారంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
అంతకుముందు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా కేటీఆర్‌కు విషెష్ చెప్పేందుకు సీనియర్ నేతలు, కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా నేతలతో కేటీఆర్ ఆప్యాయంగా మాట్లాడారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..