Cold Wave: గజగజ.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చలి పంజా.. రాగల మూడు రోజుల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో చలి మళ్లీ పంజా విసురుతోంది. ప్రధానంగా.. ఏజెన్సీ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దాంతో.. ఆయా ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి. చలితీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రాగల మూడు రోజులు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Cold Wave: గజగజ.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చలి పంజా.. రాగల మూడు రోజుల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు
Cold Wave
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 04, 2025 | 7:56 AM

తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేనంతగా చలి తీవ్రత మరింత పెరిగింది. మరి ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా చలి వణికిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే.. గత రెండు రోజులుగా అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి.. రెండురోజులుగా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. చలితో వృద్ధులు, చిన్నారులు గజగజ వణుకుతున్నారు.

తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.. రెండు రోజులుగా అత్యంత కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ హై అలెర్ట్ జారీ చేసింది. కొమరం భీమ్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.. గరిష్టంగా నల్లగొండ లో 17c నమోదు కాగా.. కనిష్టంగా ఆదిలాబాద్ లో 7.2 c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు..

  • నల్లగొండ..17 c
  • ఖమ్మం..16.6 c
  • భద్రాచలం..16.5 c
  • మహబూబ్ నగర్..16.4 c
  • నిజామాబాద్..14.4 c
  • హకీమ్ పెట్..14.3 c
  • హయత్ నగర్..14 c
  • దుండిగల్..13.8 c
  • హైదరాబాద్..13.6 c
  • హనుమకొండ..13 c
  • రామగుండం..12.8 c
  • మెదక్..11 c
  • రాజేంద్ర నగర్..10 c
  • పఠాన్ చెరువు..8.4 c
  • ఆదిలాబాద్..7.2 c

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!