Telangana: వావ్! ఆటోవాలా ఐడియా అదుర్స్.. ప్రయాణికుల కోసం భలే ఫ్లాన్ చేశాడు..!

ఉపాయం ఉండాలి కానీ, ఎలాగైనా విజయం సాధించవచ్చు.. అని మరోసారి ఓ ఆటోవాలా నిరూపించాడు. గిరాకీ లేక డీలాపడుతున్న ఆటోవాలా వినూత్న ఆలోచన చేశాడు. ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆటోలో ప్రత్యేక ఏర్పాట్లు చేయించాడు. ప్రయాణంతో పాటు మంచి వినోదాన్ని పంచుతూ అందర్నీ ఆకర్షిస్తున్నాడు.

Telangana: వావ్! ఆటోవాలా ఐడియా అదుర్స్.. ప్రయాణికుల కోసం భలే ఫ్లాన్ చేశాడు..!
Autowala
Follow us
N Narayana Rao

| Edited By: Balaraju Goud

Updated on: Jan 01, 2025 | 4:26 PM

తెలంగాణలో ఒకప్పుడు ఆటోల వల్ల ఆర్టీసీ ఆదాయం తగ్గుతోందని గొడవ ఉండేది. ఇప్పుడు బస్సుల వల్ల ఆటోల ఆదాయం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆటో డ్రైవర్లు. ఓ ఆటో డ్రైవర్ వినూత్న ఆలోచన చేశాడు.. గర్భిణీలకు ఉచిత ప్రయాణం.. మహాలక్ష్మీ పథకం బస్ జర్నీ తో ఉపాధి కోల్పోతున్నారు కొందరు ఆటో డ్రైవర్లు.

ఈ నేపథ్యంలోనే ఓ ఆటో డ్రైవర్ ప్రయాణికులను ఆకర్షించేందుకు వినూత్నంగా ఫ్లాన్ చేశాడు. ఆటో ఎక్కి ప్రయాణికులకు వినోదం పంచేందుకు టివి ఏర్పాటు చేశాడు. అంతేకాదు చిన్నపాటి ఫ్యాన్‌ను కూడా అమర్చాడు. ఆటోలో టవీ,ఫ్యాన్ చూసిన ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూటి కోసం కోటి తిప్పలు అన్నట్లు, ఒక ఆటో డ్రైవర్ తన ఉపాధి కోసం ఆటోలో మినీ ఎల్ఈడీ టీవీని, ఫ్యాన్‌ను అమర్చి ప్రయాణికులను ఆకర్షిస్తున్నాడు.

ప్రజలు ప్రయాణాలు చెయ్యాలంటే సుఖవంతమైన, ఆనందంగా గడపడానికి ఇష్టపడుతుంటారు. ఒకప్పుడు ప్రయాణాలు చేయాలంటే ఎడ్ల బండులు, లారీలు, ట్రాక్టర్లు, సైకిల్స్ మీద ప్రయాణం చేసేవారు. రాను రాను బస్సుల మీద ప్రయాణం ప్రయాణం పెరిగింది. బాగా ధనవంతులైతే కార్లలో ప్రయాణం చేసేవారు. కానీ ఇప్పుడు ఏసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు అన్ని హంగు ఆర్భాటాలు ఉన్న వాహనాల కోసం, ఎంత డబ్బైన ఖర్చు పెట్టి ప్రయాణాలు సాగిస్తున్నారు.

గ్రామాల్లో బస్సు సౌకర్యాలు తక్కువగా ఉన్న చోట ఆటోలలో ప్రయాణాలు చేయటంతో ప్రతి పట్టణంలో గ్రామాల్లో విపరీతంగా ఆటోలు పెరిగిపోయాయి. చాలా మంది తమ ఉపాధి కోసం ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలలో భాగంగా ఆర్టీసీ బుస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రవేశ పెట్టడంతో ఆటో డ్రైవర్లకు ఉపాధి తగ్గి నిరాశ ఏర్పడింది.

అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణానికి చెందిన రాము అనే ఆటో డ్రైవర్ బాగా ఆలోచించి, ప్రయాణికులను ఆకర్షించడానికి, తన జీవనోపాధి కోసం తన ఆటోలో ఒక చిన్న ఎల్ఈడీ టివి, ఒక మినీ ఫ్యాన్ ను, మంచి సౌండ్ సిస్టం ఏర్పాటు చేశాడు. పట్టణం నుండి పల్లె ప్రాంతాలకు వెళ్లేలోపు తన ఆటోలో ప్రయాణికులు టివి చూస్తూ, పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే ఈ టివి,ఫ్యాన్ ను ఏర్పాటు చేశానని రాము తెలిపాడు. ప్రయాణికులు తమ గమ్య స్తానం చేరుకునేలోపు, ఆటో లోని టివిలో సినిమాలు, పాటలు చూస్తూ ఫ్యాన్ గాలిని అస్వాదిస్తూ హాయిగా ఇంటికి చేరుకోవచ్చు అంటూ ఈ ఆటోలో తెగ ప్రయాణాలు చేస్తున్నారట. ఏది ఏమైనా ఇతని ఐడియాకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?