Tollywood: టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?

Tollywood: టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?

Anil kumar poka

|

Updated on: Jan 03, 2025 | 11:45 AM

తెలుగు సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌ని దాటేశాయి. లోకల్ కాదు.. ఇంటర్నేషనల్ అనే రేంజ్‌కి టాలీవుడ్ ఎదిగింది. కాసుల వర్షంలో రికార్డ్‌ల మీద రికార్డ్‌లు సృష్టిస్తున్నాయి తెలుగు సినిమాలు. ముఖ్యంగా రెండు, మూడేళ్లుగా పాన్ ఇండియాను తెలుగు సినిమాలు శాసిస్తున్నాయి. మిగిలిన వుడ్‌లతో పోలిస్తే టాలీవుడ్ అదరగొడుతోంది. చూస్తుండగానే ఆకాశమంత ఎదిగిన టాలీవుడ్‌కు హైదరాబాద్ అడ్డాగా మారింది. మద్రాస్ నుంచి తరలివచ్చాక హైదరాబాద్‌లో టాలీవుడ్ స్థిరపడిపోయింది.

నగరంతో పాటు చుట్టుపక్కల పరిసరాల్లో షూటింగ్‌లకు అవకాశాలు, భారీ స్టూడియోలు ఉండటం ప్లస్ పాయింట్. ఇక నగరంలో ఉన్న సదుపాయాలు కూడా టాలీవుడ్‌ను ఆకర్షించాయి. అయితే ఇటీవల సంధ్య థియేటర్ ఘటన.. తదనంతరం జరుగుతున్న రాజకీయ పరిణామాలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సినీ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారాయి.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కల్పించిన అవకాశాల వల్లే టాలీవుడ్‌కు ఇప్పుడు హైదరాబాద్ హబ్​గా మారిందన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ బాగా పెరిగిందన్నారు. టాలీవుడ్‌కు అమరావతిలో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే.. టాలీవుడ్‌ను ప్రోత్సహించడానికి అవసరమైన సదుపాయాలు, ప్రోత్సాహకాలు అందించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అమరావతి వేదిక కాబోతోందని… హైదరాబాద్‌లో మాదిరిగానే అమరావతిలో పెద్ద పెద్ద స్టూడియోలు వస్తాయనీ.. ఏపీలో అధిక సంఖ్యలో షూటింగ్‌లు జరిగే అవకాశం ఉందనీ టాక్ ఆప్ ది టాలీవుడ్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.