Vijay Varma: తమన్నా బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో చూస్తే షాకే.!
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ!! సినిమాలు, వెబ్ సిరీస్ ల కంటే మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాతో ఉన్న రిలేషన్ షిప్ కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. తమన్నాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ నెట్టింట ట్రెండ్ అవుతుంటాడు ఈ ట్యాలెంటెడ్ హీరో. కానీ ఇప్పుడు.. తాజాగా తన అనారోగ్య సమస్యను బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. తాను అరుదైన చర్య వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పాడు. మేకప్ కాస్మోటిక్స్ తో దీనికి కవర్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఇటీవల ఒక వెబ్ సిరీస్ ప్రమోషన్ సందర్భంగా మాట్లాడిన విజయ్ వర్మ తాను విటిలిగో అంటే బొల్లి అనే చర్మ సమస్యతో బాధపడుతున్నా అంటూ చెప్పాడు. దాని వల్ల తన ముఖంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయని, వాటిని దాచడానికి మేకప్ కాస్మోటిక్స్ ఉపయోగించాల్సి ఉంటుందని ఈ నటుడు వెల్లడించాడు. దీని గురించి మొదట్లో చాలా భయపడ్డానని, సక్సెస్ అందుకున్న తరువాత దాని గురించి ఆలోచించడం మానేసానని విజయ్ తెలిపాడు. బొల్లిని వైట్ స్పాట్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. ఇది అరుదైన వ్యాధి. ఇది శరీరంలో ఎక్కడైనా రావొచ్చు. చర్మం రంగు మారి తెల్లటి పాచెస్ ఏర్పడతాయి. వైద్యుల ప్రకారం శరీరంలో మెలనోసైట్లుగా పిలిచే మెలనిన్ కణాల స్థాయి క్షీణించినపుడు చర్మంపై తెల్లటి మచ్చలు వస్తాయి. దీన్నే బొల్లి అంటారు. ఇది అంటువ్యాధి కాదు. బాధితులను తాకడం ద్వారా ఇది వ్యాప్తి చెందదు. బొల్లికి ఇంకా ఖచ్చితమైన నివారణ లేదు. ఉన్న కొన్ని చికిత్సలు మాత్రమే దాని వ్యాప్తిని ఆపుతాయి. బొల్లి వ్యాధికి ప్రాథమిక లక్షణాలు కనిపించినప్పుడు మందులు, క్రీములతో చికిత్స చేయవచ్చు. దీని కోసం లేజర్ థెరపీని కూడా ఉపయోగిస్తారు. సో.. తమన్నా బాయ్ ఫ్రెండ్ ఈ వ్యాధితో బాధపడుతుండడంతో దీని గురించి నెట్ లో సెర్చింగ్ పెరిగింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.