RGV: నాకు కూతురు కన్నా ఆమె తల్లే ఇష్టం.. జాన్వీ కపూర్‌లో అది లేదు.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. ఆయన సినిమాలు ఈ మధ్య వివాదాల్లో నిలుస్తున్నాయి. గతంలో ఎన్నికల సమయంలో ఆర్జీవీ వ్యూహం అనే సినిమా చేశారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన వ్యూహం సినిమా పలు వివాదాల్లో ఇరుక్కుంది. ఈ సినిమా పై చాలా విమర్శలు కూడా వచ్చాయి.
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం చేసిన అది వైరల్ అవుతుంది. ఒకప్పుడు టాలీవుడ్ ను షేక్ చేసే సినిమాలు చేసిన ఆర్జీవీ.. ఇప్పుడు కాస్త విభిన్నంగా రొమాంటిక్ సినిమాలు చేస్తున్నారు. అలాగే బోల్డ్ సినిమాలు చేస్తున్నారు ఆర్జీవీ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆర్జీవీ .. చాలా సంచలన పోస్ట్ లు చేశారు. రాజకీయంగా నాయకులను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్స్ తెగ వైరల్ అయ్యాయి. ఇటీవల పోలీస్ కేసులోనూ ఇరుక్కున్నారు. వ్యూహం సినిమా ప్రమోషన్స్ విషయంలో ఆర్జీవీ పై కేసు నమోదు అయ్యింది. ఇవన్నీ పక్కన పెడితే ఆర్జీవీకి శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీదేవి ఆర్జీవీ ఆరాధ్య దేవత. ఆమె అంటే ఆయనకు పిచ్చి.
ఇది కూడా చదవండి : దిమ్మతిరిగింది సామి..! ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్.. ప్రభాస్ ఫ్రెండ్ సిస్టర్సా..!!
చిన్న సందర్భం దొరికిన ఆర్జీవీ శ్రీదేవి గురించే చెప్తారు. ఆమె మరణం తర్వాత కూడా ఆర్జీవీ ఆమెను ఇష్టపడుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఆమెను ఆర్జీవీ తలుచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. శ్రీదేవి గురించి మాట్లాడుతూ.. శ్రీదేవిని ఎవరితో పోల్చడానికి లేదు అని అన్నారు. ఆమె అందం, అభినయం ఎవరి వల్ల కాదు అని అన్నారు ఆర్జీవీ.
ఇది కూడా చదవండి : Kanchana 4: దెయ్యంగా భయపెట్టనున్న హాట్ బ్యూటీ.. కాంచన 4లో ఆ క్రేజీ భామ
శ్రీ దేవి నటిస్తుంటే అలా చూస్తూ.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది శ్రీదేవి. ఒక పదహారేళ్ల వయస్సు కావచ్చి.. ఒక వసంత కోకిల కావచ్చు. ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించింది. శ్రీదేవి స్క్రీన్ మీద కనిపిస్తే నేను ఒక దర్శకుడిని అని మర్చిపోతాను అని అన్నారు ఆర్జీవీ. అలాగే శ్రీదేవి కూతురు జాన్వికపూర్ గురించి మాట్లాడుతూ.. శ్రీదేవి అందం తన కూతురికి రాలేదు. నాకు శ్రీదేవి అంటేనే ఇష్టం.. జాన్వీలో శ్రీదేవి అందం లేదు. ఆమెతో నేను సినిమా చేయను అని తెగేసి చెప్పాడు వర్మ. ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
View this post on Instagram
జాన్వీ కపూర్ ఇన్ స్టా గ్రామ్ ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి