Watch Video: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన కోహ్లీ క్లోజ్ ఫ్రెండ్.. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ ఇదే..
బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున ఆడుతున్న గ్లెన్ మాక్స్‌వెల్ ఆశ్చర్యకరమైన క్యాచ్ పట్టుకున్నాడు. మాక్స్‌వెల్ బ్రిస్బేన్ హీట్‌పై మొత్తం 4 క్యాచ్‌లు తీసుకున్నాడు. అయితే చివరి క్యాచ్ మాత్రం మాక్స్‌వెల్ సూపర్‌గా అందుకున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ బ్యాటింగ్‌తో పాటు అద్భుతమైన ఫీల్డింగ్ కూడా చేస్తాడు. ఈ విషయం క్రికెట్ అభిమానులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ మైదానంలో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నాడు. అయితే ఈసారి బిగ్ బాష్ లీగ్ అలాంటి క్యాచ్ తీసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున ఆడుతున్న గ్లెన్ మాక్స్‌వెల్, బ్రిస్బేన్ హీట్‌పై ఈ క్యాచ్ పట్టాడు, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసింది. దీనికి అతిపెద్ద కారణం గ్లెన్ మాక్స్‌వెల్ ఫీల్డింగ్.. ఈ మ్యాచ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ మొత్తం 4 క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతని చివరి క్యాచ్ అత్యంత అద్భుతమైనది. బ్రిస్బేన్ హీట్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ స్టార్స్ బౌలర్ డేనియల్ లారెన్స్ వేశాడు. ఈ ఓవర్ మొదటి బంతికి, బ్యాట్స్‌మన్ విల్ ప్రెస్టీజ్ ముందుకు వచ్చి పెద్ద షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అది లాంగ్-ఆన్ వైపు వెళ్ళింది.
విల్ ప్రెస్టీజ్ షాట్ కొట్టినప్పుడు, అది సిక్సర్‌కు చేరే పెద్ద షాట్‌గా కనిపించింది. కానీ గ్లెన్ మాక్స్‌వెల్ అక్కడే ఉన్నాడు. అతను దూకి ఒక చేత్తో బంతిని క్యాచ్ చేశాడు. అతను బంతిని బౌండరీ దాటకుండా ఆపి, ఆపై బంతిని తన అండర్ ఆర్మ్ ద్వారా మైదానంలోకి తీసుకువచ్చాడు. దీని తర్వాత గ్లెన్ మాక్స్‌వెల్ మైదానంలోకి వచ్చి క్యాచ్ పూర్తి చేశాడు. కష్టమైన ఈ క్యాచ్‌ను గ్లెన్ మాక్స్‌వెల్ చాలా సులువుగా పట్టుకున్నాడు. BBLలో ఈ సీజన్ మాక్స్‌వెల్‌కు ప్రత్యేకమైదేమి కాదు. ఈ మ్యాచ్‌కి ముందు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 53 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లోనూ ఒకే ఒక్క వికెట్ తీశాడు. అతను బ్రిస్బేన్ హీట్‌పై కూడా బౌలింగ్ చేయలేదు.
GLENN MAXWELL!
CATCH OF THE SEASON. #BBL14 pic.twitter.com/3qB9RaxHNb
— KFC Big Bash League (@BBL) January 1, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..