చరిత్రలో తొలిసారిగా.. భారత సంతతికి చెందిన ఆరుగురు US పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం

అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఇండో-అమెరికన్లు సత్తా చాటారు. 12 సంవత్సరాల క్రితం ఒకరు మాత్రమే ఉంటే, ఈసారి అరుగురు భారత సంతతి వ్యక్తులు విజయం సాధించి అమెరికా పార్లమెంటులో అడుగుపెట్టారు. చరిత్రలో తొలిసారిగా ఆరుగురు భారతీయ అమెరికన్లు అమెరికా పార్లమెంటు సభ్యులుగా ప్రమాణం స్వీకారం చేశారు.

చరిత్రలో తొలిసారిగా.. భారత సంతతికి చెందిన ఆరుగురు US పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం
Indians In Us Parliament
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 04, 2025 | 11:13 AM

భారతీయులు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తమదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు అమెరికా ప్రతినిధుల సభలో భారతీయ అమెరికన్లు తమ ఆధిపత్యాన్ని నెలకొల్పారు. ఇంత పెద్ద సంఖ్యలో భారతీయ-అమెరికన్లు ప్రతినిధుల సభ సభ్యులుగా ప్రమాణం చేయడం ఇదే తొలిసారి. వీరిలో డాక్టర్ అమీ బెర్రీ, సుహాస్ సుబ్రమణియన్, శ్రీ తానేదార్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్ ఉన్నారు.

ఎంపీ డాక్టర్ అమీ బెర్రీ సోషల్ మీడియా ఎక్స్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో ‘నేను 12 సంవత్సరాల క్రితం మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ నుండి ఏకైక ఎంపీని. ఆ తర్వాత ముగ్గురు ఎంపికయ్యారు. అమెరికన్ చరిత్రలో నిలిచిపోయే క్షణమిది’ అంటూ అమీ బెర్రి రాసుకొచ్చారు. ‘కానీ ఇప్పుడు మేము ముగ్గురు కాదు.. ఆరుగురు ఉన్నాం. రాబోయే సంవత్సరాల్లో కూడా అమెరికా పార్లమెంట్‌లో మన కమ్యూనిటీకి చెందిన వారి సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. US హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యునిగా, బెరా వరుసగా ఏడవసారి ఎన్నికయ్యారు. కాలిఫోర్నియా నుండి ప్రతినిధిగా ప్రమాణం చేశారు. అతను మొత్తం 6 మంది భారతీయ-అమెరికన్ ఎంపీల ఫోటోను కూడా పోస్ట్ చేశారు. సుహాస్ సుబ్రమణియన్ ప్రతినిధుల సభ సభ్యునిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు.

తన కుటుంబం, హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్‌తో కలిసి ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేస్తూ, సుబ్రమణియన్ ఈ రోజు నా మొదటి పని దినం అని రాశారు. అమెరికా పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేయడం గర్వంగా భావిస్తున్నన్నారు. ఖన్నా, కృష్ణమూర్తి, జైపాల్ వరుసగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

ఇక అమెరికా హౌస్ స్పీకర్‌గా మైక్ జాన్సన్ మరోసారి ఎన్నికయ్యారు. ఆయనకు మొత్తం 218 ఓట్లు వచ్చాయి. కాగా, ఆయన ప్రత్యర్థి డెమోక్రటిక్ నాయకుడు హకీమ్ జెఫ్రీస్‌కు మొత్తం 215 ఓట్లు వచ్చాయి. ఈ విజయం తనకు దక్కిన పెద్ద విజయమన్నారు. కాగా, స్పీకర్ ఎన్నికకు ముందు సొంత పార్టీకి చెందిన కొందరు నిరసన వ్యక్తం చేశారు. ప్రత్యర్థులలో సౌత్ కరోలినాకు చెందిన రాల్ఫ్ నార్మన్, టెక్సాస్‌కు చెందిన కీత్ సెల్ఫ్ ఉన్నారు. ఇద్దరు హౌస్ రిపబ్లికన్లు ప్రారంభంలో ఇతర అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..