నల్ల క్యారెట్ లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు..!
01 January 2025
Jyothi Gadda
TV9 Telugu
నల్ల క్యారెట్లలో ఆంథోసయనిన్ అనే పదార్థం ఉండటంవల్ల వాటికి ఆ రంగు వస్తుంది. ఈ ఆంథోసయనినే మన శరీరానికి క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తిని ఇస్తుంది.
TV9 Telugu
సాధారణ క్యారెట్లలో మాదిరిగానే నల్ల క్యారెట్‌లలోనూ బీటాకెరాటిన్ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి కణాలకు రక్షణ కల్పిస్తుంది.
TV9 Telugu
నల్ల క్యారెట్‌లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన జీర్ణక్రియకు తోడ్పడుతాయి. నల్ల క్యారెట్లు తినడంవల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవ్వడమేగాక ఒంట్లో కొవ్వు కూడా తగ్గుతుంది.
TV9 Telugu
చాలామందిని రుమటాయిడ్ ఆర్ధరైటిస్ సమస్య వేధిస్తుంటుంది. నల్ల క్యారెట్లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటి ఆక్సిడెంట్ గుణాలు ఈ సమస్యకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.
TV9 Telugu
మతిమరుపు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు నల్ల క్యారెట్లను తినడం అలవాటు చేసుకుంటే పరిష్కారం లభిస్తుంది. నల్ల క్యారెట్లు అల్జీమర్స్ ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయి.
TV9 Telugu
బ్లాక్ క్యారెట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఇది కంటి చూపును మెరుగుపడేలా చేస్తుంది. ఊబకాయంతో బాధపడేవారికి బ్లాక్ క్యారెట్ గొప్ప మెడిసిన్‌లా పనిచేస్తుంది. బరువు తగ్గుతారు.
TV9 Telugu
నల్ల క్యారెట్లలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి చర్మాన్ని మెరిసిపోయేలా చేస్తుంది. చర్మంపై ముడతలు తగ్గి ముఖం అందంగా ప్రకాశవంతంగా ఉంటుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
TV9 Telugu
బ్లాక్ క్యారెట్ తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ లో ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనివల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుండెకు కూడా మంచిది.