AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం ప్రియులకు చిన్న సవాల్‌..! విస్కీలో ఎంత నీరు కలుపుకోవాలి..?

కొందరు ఐస్ తో తాగుతారు. ఇంకా 99.90 శాతం మందికి విస్కీ రుచిని పెంచడానికి ఎంత నీరు కలపాలో తెలియదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, విస్కీ అసలు రుచిని సంరక్షించడానికి ఎంత నీరు కలుపుకోవాలో మీకు తెలుసా..? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఒక పరిశోధన జరిగింది. అత్యంత అనుభవజ్ఞులైన విస్కీ టేస్టర్ల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. శాస్త్రవేత్తలు 100 శాతం విస్కీని, 90 శాతం విస్కీని 10 శాతం నీటితో, 80 శాతం విస్కీని 20 శాతం నీటితో, 70 శాతం విస్కీని 30 శాతం నీటితో, 60 శాతం విస్కీని 40 శాతం నీటితో, 50 శాతం విస్కీని 50 శాతం నీటితో పరీక్షించారు.

మద్యం ప్రియులకు చిన్న సవాల్‌..! విస్కీలో ఎంత నీరు కలుపుకోవాలి..?
Whiskey
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 26, 2024 | 5:30 PM

ప్రపంచవ్యాప్తంగా విస్కీ ప్రియులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే ఆల్కహాల్ సేవించే అలవాటు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. అంతేకాకుండా, ప్రతి ఆల్కహాల్ వినియోగంలో ఒక పద్ధతి ఉంటుంది. కొందరు ఐస్‌తో విస్కీ తాగితే మరికొందరు నీరు లేదా సోడాతో తాగుతారు. ప్రతి ఒక్కరూ విస్కీలో తమకు నచ్చినంత నీరు కలుపుకుంటారు. కానీ 99.90 శాతం మందికి విస్కీలో ఎంత నీరు కలిపితే ప్రత్యేక రుచి ఏర్పడుతుందో తెలియదు. కొందరు ఐస్ తో తాగుతారు. ఇంకా 99.90 శాతం మందికి విస్కీ రుచిని పెంచడానికి ఎంత నీరు కలపాలో తెలియదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, విస్కీ అసలు రుచిని సంరక్షించడానికి ఎంత నీరు కలుపుకోవాలో మీకు తెలుసా..? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఒక పరిశోధన జరిగింది. వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ, మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ మరియు ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన ఆహార శాస్త్రవేత్తలు 2023లో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ బృందం విస్కీ,నీరు వివిధ నిష్పత్తులను అధ్యయనం చేసింది.

ఈ బృందం బోర్బన్, రై, సింగిల్-మాల్ట్, బ్లెండెడ్ స్కాచ్, ఐరిష్ విస్కీలతో సహా 25 రకాల విస్కీలను అధ్యయనం చేసిందని ఫుడ్స్ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన తెలిపింది. అత్యంత అనుభవజ్ఞులైన విస్కీ టేస్టర్ల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. శాస్త్రవేత్తలు 100 శాతం విస్కీని, 90 శాతం విస్కీని 10 శాతం నీటితో, 80 శాతం విస్కీని 20 శాతం నీటితో, 70 శాతం విస్కీని 30 శాతం నీటితో, 60 శాతం విస్కీని 40 శాతం నీటితో, 50 శాతం విస్కీని 50 శాతం నీటితో పరీక్షించారు.

80 శాతం విస్కీని 20 శాతం నీళ్లతో కలపడం వల్ల మంచి రుచి వస్తుందని అధ్యయనం వెల్లడించింది. అలాగే, విస్కీ అసలు రుచి మారదని తేల్చారు.. ఈ అధ్యయనం ఇదే బెస్ట్‌ మిక్సింగ్‌ అని అంగీకరించింది. నీటిలో బాగా కలపని నాన్-హైడ్రోఫిలిక్ అణువులు తొలగించబడతాయి. ఫలితంగా సమతుల్య రుచి వస్తుంది వారు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

పరిశోధన ప్రకారం, 20 శాతం కంటే ఎక్కువ నీటిని కలపడం వల్ల విస్కీ ప్రత్యేక రుచిని తగ్గిస్తుంది. 90 శాతం, 10 శాతం నీరు కలపడం సరైనది కాదని పేర్కొన్నారు. ఈ అధ్యయనం ప్రకారం, డబుల్ పెగ్‌కి అంటే 60 ml విస్కీకి 12 ml కంటే ఎక్కువ నీరు కలపకూడదు. అధ్యయనాల ప్రకారం, 12 ml నీరు విస్కీ రుచిని నిలుపుకుంటుంది. ఎక్కువ నీరు కలపటం వల్ల విస్కీ పలుచగా, రుచి తక్కువగా మారుతుంది. చెప్పాలంటే, ఇది దాని సహజ రుచిని నాశనం చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..