AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..! కొన్నింటిని మచ్చిక చేసుకోండి..

కడుపు చల్లగా ఉండేందుకు ఐస్‌క్రీం, శీతల పానీయాలు వంటివి కూడా తీసుకోవద్దు. ఐస్ క్రీం జీర్ణక్రియ సమయంలో శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. జలుబు, జ్వరం వంటివి ఎటాక్‌ చేస్తాయి. కాబట్టి ఇలాంటి కృత్రిమ పానీయాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా వేసవిలో ఆహారం తింటూ సులువుగా బరువు తగ్గొచ్చు. వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో..

ఈ వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..! కొన్నింటిని మచ్చిక చేసుకోండి..
What To Eat And What Not
Jyothi Gadda
|

Updated on: Feb 24, 2024 | 1:07 PM

Share

ఫిబ్రవరి అయిపోయిచ్చింది.. అప్పుడే వేసవి ప్రతాపంప్రారంభమైంది. సన్బర్న్ నెమ్మదిగా పెరుగుతోంది. ఈ ఏడాది ఎండ వేడిమి మరింత పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. అందుకు శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. వేసవి కాలంలో ఎక్కువగా నూనె, వేపుడు పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. జంక్ ఫుడ్స్ అనారోగ్యం కలిగిస్తాయి. ముఖ్యంగా వేసవిలో ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. నూనె పదార్థాలు తీసుకోవడం వల్ల పొట్ట భారంగా మారి జీర్ణక్రియ మందగిస్తుంది.

వేసవి కాలంలో టీ, కాఫీలు తాగడం రోజంతా మానేయాలి. వేడి పానీయాల వినియోగాన్ని తగ్గించండి. లేదంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. శరీరం అంతర్గత ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ చెదిరిపోతుంది.

చికెన్-మటన్ వంటి ఆహారాలు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. కాబట్టి వేసవిలో మాంసానికి దూరంగా ఉండటం మంచిది. అలాగే స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినకూడదు. ఇది అధిక చెమట, నిర్జలీకరణానికి దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

కడుపు చల్లగా ఉండేందుకు ఐస్‌క్రీం, శీతల పానీయాలు వంటివి కూడా తీసుకోవద్దు. ఐస్ క్రీం జీర్ణక్రియ సమయంలో శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. జలుబు, జ్వరం వంటివి ఎటాక్‌ చేస్తాయి. కాబట్టి ఇలాంటి కృత్రిమ పానీయాలకు దూరంగా ఉండండి.

వేసవిలో కచ్చితంగా తినాల్సినవి ఇవే..

వేసవిలో ఆహారం తింటూ సులువుగా బరువు తగ్గొచ్చు. వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో సీజనల్ పండ్లయినా పుచ్చకాయలు, మామిడి, బెర్రీలు కచ్చితంగా తినాలి. వాటిలో నీటి శాతం కూడా ఎక్కువ. పైనాపిల్, పీచెస్ వంటివి మన శరీరాన్ని హైడ్రేటింగ్‌గా ఉంచేందుకు ఉపయోగపడతాయి. అవి తినడం వల్ల అందే క్యాలరీలు తక్కువే. కొవ్వు శాతం సున్నా.  వేసవిలో కొబ్బరినీళ్ళకు మించిన ఔషధం లేదు. వీటిలో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. రోజుకో కొబ్బరి బోండం తాగిన చాలు, రోజంతా శరీరంలో వేడి పెరగకుండా అడ్డుకోవచ్చు. పండ్లు లేదా కూరగాయలతో చేసిన సలాడ్‌ను రోజూ తినాలి. ఇది తేలికపాటి ఆహారం. శక్తిని మాత్రం అందిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..