Pregnant Women: గర్భిణులు జాగ్రత్త..! 70 శాతం మంది దీనికి గురవుతున్నారట..?
Pregnant Women: కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది డిప్రెషన్‌తో పోరాడుతున్నారు. అన్ని వయసుల వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఒక పరిశోధనలో
Pregnant Women: కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది డిప్రెషన్‌తో పోరాడుతున్నారు. అన్ని వయసుల వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఒక పరిశోధనలో కరోనా సోకిన గర్భిణీలలో దాదాపు 70 శాతం మంది డిప్రెషన్ బాధితులేనని తేలింది. కరోనా ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రికి చేరుకున్న 243 మంది గర్భిణులపై ఈ పరిశోధన చేశారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 50 శాతం మంది మహిళల్లో భయాందోళన లక్షణాలు కనిపించాయి. కరోనా కాలానికి ముందు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం కేవలం 30 శాతం మంది గర్భిణీలు మాత్రమే ప్రసవ సమయంలో డిప్రెషన్‌లో ఉన్నట్లు తేలింది. కరోనా తర్వాత ఈ సంఖ్య రెట్టింపు అయింది.
చాలా మంది మహిళల్లో నెలల తరబడి డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తున్నాయి.16.57 శాతం మందికి తేలికపాటి లక్షణాలు,14 శాతం మందిలో తీవ్రమైన లక్షణాలు ఉన్నట్లు వైద్యులు నిర్దారించారు. గర్భిణీల మానసిక ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు సున్నితంగా మెదలాలి. కరోనా సోకిన మహిళలు భయపడవద్దు. కరోనా తర్వాత కూడా తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ప్రపంచంలో 260 మిలియన్లకు పైగా ప్రజలు డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. చాలా మందికి దీని లక్షణాల గురించి తెలియదు. డిప్రెషన్ అనేది ఒక మానసిక వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. వీరికి సకాలంలో చికిత్స చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సమస్య చాలా కాలం పాటు కొనసాగితే అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.
డిప్రెషన్ లక్షణాలు.. 1. దృష్టి కేంద్రీకరించడం కష్టం 2. ఏదైనా పని చేయడంలో ఆసక్తి లేకపోవడం 3. నిద్ర లేకపోవడం 4. ఆత్మహత్య ఆలోచనలు 5. ఎల్లప్పుడూ విచారంగా ఉండటం