Kidney Health: సైలెంట్ కిల్లర్స్.. ఈ 7 అలవాట్లే మీ కిడ్నీలను నాశనం చేసే యమపాశాలు.. లైట్ తీసుకున్నారో..
మనం ఆరోగ్యంగా జీవించాలంటే మూత్రపిండాలు పనితీరు కూడా ఎంతో ముఖ్యం.. ఇవి మన శరీరంలోని విషాన్ని ఫిల్టర్ చేయడానికి, ద్రవాలను సమతుల్యం చేయడానికి, రక్తపోటును నిర్వహించడానికి 24 గంటలూ పనిచేస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుత రోజుల్లో మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు మన శరీరంలోని ఇలాంటి ముఖ్యమైన ఆవయవాల పనితీరును సైలెంట్‌గా నాశనం చేస్తున్నాయి. కాబట్టి రహస్యంగా మీ మూత్రపిండాలను దెబ్బతీసే ఏడు సాధారణ అలవాట్లు గురించి ఇక్కడ తెలుసుకుందాం.

మూత్రపిండాలు.. మన శరీరంలో అత్యంత కష్టపడి పనిచేసే అవయవాలలో ఇది కూడా ఒకటి. ఇవి రోజుకు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేసి మన శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తాయి, ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తాయి. అలాగే శరీరంలో తగిన హైడ్రేషన్ స్థాయిలను నిర్వహిస్తాయి. కానీ ప్రస్తుత రోజుల్లో మారుతున్న అలవాట్లు వాటిని పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అయితే ఇక్క శుభవార్త ఏమిటంటే, మనం కొన్ని అలవాట్లను మార్చుకోవడం ద్వారా మూత్రపిండాల నష్టానికి దారితీసే అలవాట్లను మనం నివారించవచ్చు. దీని ముందు మనం తెలుసుకోవలసి విషయం ఏమిటంటే.. మూత్రపిండాలు హాని కలిగించే మన అలవాట్లు ఏవని..
సైలెంట్‌గా మీ మూత్రపిండాలను దెబ్బతీసే ఏడు రోజువారీ అలవాట్లు
తగినంత నీరు త్రాగకపోవడం: మన మూత్రపిండాలు సరిగ్గా పనిచేయాలంటే మనం శరీరానికి అవసరమైన నీటిని అందించాలి. లేక పోతే మూత్రపిండాల వడపోత శక్తి తీవ్రంగా తగ్గిపోతుంది. మీరు నిరంతరం నిర్జలీకరణానికి గురైతే, మీ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం లేదా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు రోజకూ 2–3 లీటర్లు నీటిని తాగాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
ఫెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్స్ వాడటం.. ఇబుప్రోఫెన్ వంటి నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDలు) ఎక్కువగా వాడటం వల్ల మూత్రపిండాలకు రక్త ప్రవాహం తగ్గుతుంది. ఈ పెయిన్ కిల్లర్స్ తాత్కాలికంగా నొప్పిని తగ్గించవచ్చు కానీ దీర్ఘకాలంలో మూత్రపిండాల కణజాలాలకు హానికరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడటం ఉత్తమం.
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం: మీరు తినే ఆహారంలో ఉండే సోడియం( ఉప్పు) మూత్రపిండాలు కష్టపడి పనిచేసేలా చేస్తుంది, అలాగే ఇది రక్తపోటును పెంచుతుంది, ఇది మూత్రపిండాల వ్యాధికి ప్రధాన కారణంగా పరిగణించబడుతుంది.
అధిక రక్తపోటు: నియంత్రణలో లేని మధుమేహం, అధిక రక్తపోటు మీ మూత్రపిండాలను ప్రమాదంలో పడేస్తున్నాయి. మూత్రపిండాలకు దీర్ఘకాలిక నష్టం జరగకుండా రక్షించడానికి మీరు ఎప్పటికప్పుడూ హెల్త్ చెకప్ చేయించుకోండి.. అలాగే వైద్యుల సలహా మేరకు మందులు తీసుకోండి.
మూత్రం ఆపుకోవడం: మూత్రాన్ని ఆపుకోవడం కూడా చాలా ప్రమాదకరం. మూత్రాశయం, మూత్రపిండాలను తరచుగా మూత్రంతో నింపడం వల్ల ఆ అంతర్గత అవయవాల ప్రవాహానికి అంతరాయం కలుగుతుంది. అలాగే ఇది ఇన్ఫెక్షన్ లేదా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి దారి తీస్తుంది. కాబట్టి మీరు మూత్రాన్ని ఆపుకోవడం చేయకండి.
అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలు: అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలు తీసుకోవడం కూడా మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. ఇది ఎక్కువగా మాంసాహారం, అల్ట్రా-ప్రాసెస్డ్ చేసిన ఆహారం తినే వారిలో జరుగుతుంది. కాబట్టి ఈ వీటికి బదులుగా పండ్లు, కూరగాయలు, మొక్కల ఆధారిత ప్రోటీన్లు మీ ఆహారాన్ని సమతుల్యం చేసుకోవడానికి సహాయపడతాయి.
నిద్ర లేకపోవడం: నిద్ర లేకపోవడం వల్ల మూత్రపిండాల సహజ మూత్రపిండ చక్రం, హార్మోన్ల నియంత్రణ దెబ్బతింటుంది. కాబట్టి మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకూ కనీసం 7–8 గంటలు నిద్రపోవాలని వైద్యులు చెబుతున్నారు. మన మూత్రపిండాల ఆరోగ్యం అనేది మన రోజువారి అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి పైన పేర్కొన్న అలవాట్లను నివారించడం ద్వారా మీరు మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం, పరిష్కారాలు సాధారణ అవగాహన కోసం మాత్రమే. మేము వాటిని నిర్దారించడం లేదు. వాటిని స్వీకరించే ముందు ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




