Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bad Breath Solution: నోటి దుర్వాసనతో నలుగురిలో ఇబ్బంది పడుతున్నారా..? అయితే, ఈ టిప్స్ మీ కోసమే..

దంతాలు పరిశుభ్రంగా లేనప్పుడు, తగినంత నీరు తాగనప్పుడు లేదా మరేదైనా నోటి వ్యాధికి గురైనప్పుడు నోటి నుంచి దుర్వాసన వస్తుంది.

Bad Breath Solution: నోటి దుర్వాసనతో నలుగురిలో ఇబ్బంది పడుతున్నారా..? అయితే, ఈ టిప్స్ మీ కోసమే..
Bad Breath
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 21, 2022 | 8:18 PM

Bad Breath Causes: మంచి వ్యక్తిత్వాన్ని తెలిపేందుకు మన నోటి పరిశుభ్రత చాలా అవసరం. నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. నోటి దుర్వాసన అనేది చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. ఇది దంతాలు పరిశుభ్రంగా లేనప్పుడు, తగినంత నీరు తాగనప్పుడు లేదా మరేదైనా నోటి వ్యాధికి గురైనప్పుడు నోటి నుంచి దుర్వాసన వస్తుంది. పరిశుభ్రత, దుర్వాసన లేని జీవనం అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. నోటి దుర్వాసన సమస్య మీ ఆత్మవిశ్వాసాన్ని సైతం తగ్గిస్తుంది. నోటి ఆరోగ్యానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

గ్రీన్ టీ: గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. జిమ్‌‌కు వెళ్ళే వ్యక్తులు ఎల్లప్పుడూ బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ లాంటివి తాగాలని పేర్కొంటారు. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది నోటి దుర్వాసనను అనుమతించదు. దీనితోపాటు ఇది శరీర నిర్విషీకరణకు మంచి పానీయం.

సిట్రస్ పండ్లు: విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు నోటి దుర్వాసనను పోగొట్టడానికి అత్యంత ప్రయోజనకరమైనవిగా పరిగణిస్తారు. నారింజ, మొసాంబి, ద్రాక్ష, విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఇతర పండ్ల వంటి సిట్రస్ పండ్లను తీసుకోవడం ద్వారా నోటి చిగుళ్ళ నుంచి వచ్చే దుర్వాసనను సులభంగా తొలగించవచ్చు. దీనితో పాటు దంతాలకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

పెరుగు: భోజనం చేసిన తర్వాత దీన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది. అంటే జీర్ణశక్తికి ఇది ఉత్తమమైన సూపర్‌ఫుడ్‌గా పేర్కొంటారు. పెరుగులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది నోటి దుర్వాసనను దూరం చేయడంతోపాటు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అల్లం: అల్లం ఎన్నో సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది. దీనిని టీలో, ఇంకా పలు పదార్థాల్లో కూడా ఉపయోగించవచ్చు. అల్లంలో 6-జింజెరాల్ అనే మూలకం ఉంటుంది. ఇది మన లాలాజల ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. దీని కోసం అల్లం నమలడంతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో పుక్కిలించాలి. ఇలా చేయడం ద్వారా తాజా అనుభూతిని కలిగించడంతోపాటు నోటి దుర్వాసన పోతుంది.

మరిన్ని హెల్త్  న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి