జీఎన్ రావు, బొస్టన్ కమిటీకి తేడాలివే!
జీఎన్ రావు కమిటీ నివేదిక.. బీసీజీ రిపోర్టు ప్రస్తుతం రెండూ ప్రభుత్వం చేతికందాయి. ఇక ఈ రెండు నివేదికలపై ప్రభుత్వమే ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. రాజధాని మార్పు అనివార్యంగా మారిన పరిస్థితుల్లో మార్పుచేర్పులేమైనా ఉంటాయా అన్నది ఆసక్తిగా మారింది. అయితే.. ఇప్పుడు జీఎన్ రావు, బోస్టన్ రిపోర్టులను మధ్య తేడాలేమైనా ఉన్నాయా? లేక మక్కీకి మక్కీకి దించేశారా? అదేంటో చూద్దాం. జీఎన్ రావు కమిటీ నివేదిక: విశాఖలో హైకోర్టు బెంచి ఏర్పాటు చేయాలని జీఎన్‌రావు కమిటీ […]
జీఎన్ రావు కమిటీ నివేదిక.. బీసీజీ రిపోర్టు ప్రస్తుతం రెండూ ప్రభుత్వం చేతికందాయి. ఇక ఈ రెండు నివేదికలపై ప్రభుత్వమే ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. రాజధాని మార్పు అనివార్యంగా మారిన పరిస్థితుల్లో మార్పుచేర్పులేమైనా ఉంటాయా అన్నది ఆసక్తిగా మారింది. అయితే.. ఇప్పుడు జీఎన్ రావు, బోస్టన్ రిపోర్టులను మధ్య తేడాలేమైనా ఉన్నాయా? లేక మక్కీకి మక్కీకి దించేశారా? అదేంటో చూద్దాం.
జీఎన్ రావు కమిటీ నివేదిక:
విశాఖలో హైకోర్టు బెంచి ఏర్పాటు చేయాలని జీఎన్‌రావు కమిటీ సూచించింది. ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం ఉండాలని, విశాఖలోనే వేసవికాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. మరోవైపు అమరావతిలో హైకోర్టు బెంచీ ఏర్పాటు చేయాలని జీఎన్‌రావు కమిటీ పేర్కొంది. శాసన రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది. ఇక న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్టు సూచన.
బోస్టన్ కమిటీ నివేదిక:
అటు బీసీజీ రిపోర్టు సైతం విశాఖపై జీఎన్‌రావు కమిటీ నివేదికలోని అంశాలకు ప్రాధాన్యతనిచ్చినట్లు స్పష్టమవుతోంది. బీసీజీ రిపోర్టు ఆప్షన్ 1 ప్రకారం విశాఖపట్నంలో గవర్నర్, సీఎం ఆఫీస్, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలని పేర్కొంది. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన శాఖలనూ విశాఖలోనే ఏర్పాటు చేయాలని సూచించింది. దీనిని బట్టి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నంకే బీసీజీ నివేదిక ఓటేసింది. బీసీజీ రిపోర్టు ఆప్షన్ 2లోనూ విశాఖలోనే సెక్రటేరియట్, సీఎం ఆఫీస్.. పేషీలు, అన్ని ప్రభుత్వ శాఖల HODలు, అత్యవసర సమావేశాల కోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ ఉండాలని సూచించింది.
బీసీజీ రిపోర్టు ఆప్షన్ 1 ప్రకారం అమరావతిలో అసెంబ్లీ, ఎడ్యుకేషన్‌కు సంబంధించి HOD ఆఫీస్‌లు, వ్యవసాయ సంబంధిత కార్యాలయాలు, సంక్షేమ-స్థానిక సంస్థల ఆఫీస్‌లు, హైకోర్టు బెంచ్ ఉండాలని చెప్పింది. ఆప్షన్ 2 ప్రకారం.. అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ మాత్రమే ఉంటాయి. ఆప్షన్ 2 కింద కర్నూలులోనే హైకోర్టు, స్టేట్ కమిషనరేట్లు, అప్పిలేట్ అథారిటీలు ఉండాలని బీసీజీ నివేదిక సూచించింది. ఆప్షన్ 1 ప్రకారం చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 4 వేల 645 కోట్ల రూపాయలన్నది అంచనా. ప్రభుత్వం ఆప్షన్ 2ను సెలక్ట్ చేసుకుంటే.. మొత్తంగా 2 వేల 5 వందల కోట్ల నుంచి 3 వేల 500 కోట్ల మధ్య ఖర్చు అవుతుంది. అంటే ఆప్షన్ 1తో పోల్చితే ఆప్షన్ 2 ద్వారా 12 వందల కోట్ల నుంచి 15 వందల కోట్లు మిగులుతుందన్న మాట. అలాగే.. బీసీజీ నివేదిక ఆప్షన్‌లో 1 కర్నూలుకు హైకోర్టు, ఆయా శాఖల కమిషనరేట్లను, అప్పిలేట్ అథారిటీలను సూచించింది.
కాగా.. మొత్తానికి అన్ని ప్రాంతాల అభిృద్ధికీ రెండు కమిటీలూ ఓటు వేశాయి. ఈ రెండు కమిటీలు విశాఖనే రాజధానిగా మేలని చెప్పకనే చెప్పాయి. ఇక దీనిపై సీఎం జగన్ డెసిషన్ ఎలా ఉంటుందో చూడాలి.