లిప్‌స్టిక్ వాడితే పుట్టే పిల్లలపై చెడు ప్రభావం..!
Latest Health Tips: లిప్‌స్టిక్ వాడకం నుంచి గర్భిణీ స్త్రీలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు. లిప్‌స్టిక్‌లు, సౌందర్య సాధనాలు లాంటివి ఏదైనా ఉపయోగిస్తే.. వాటిలో ఉండే రసాయనాల కారణంగా పుట్టే బిడ్డల శారీరిక కదిలికలు తక్కువయ్యే ప్రమాదముందట.! వారు ఎదిగే క్రమంలో తీవ్రస్థాయి మానసిక సమస్యలు ఎదుర్కుంటారని అమెరికా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సౌందర్య సాధనాల్లో సధాలేట్స్ అనే రసాయనాలు ఉంటాయని వాటిని గర్భిణీలు వినియోగిస్తే.. వారికీ పుట్టబోయే పిల్లలపై […]
Latest Health Tips: లిప్‌స్టిక్ వాడకం నుంచి గర్భిణీ స్త్రీలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు. లిప్‌స్టిక్‌లు, సౌందర్య సాధనాలు లాంటివి ఏదైనా ఉపయోగిస్తే.. వాటిలో ఉండే రసాయనాల కారణంగా పుట్టే బిడ్డల శారీరిక కదిలికలు తక్కువయ్యే ప్రమాదముందట.! వారు ఎదిగే క్రమంలో తీవ్రస్థాయి మానసిక సమస్యలు ఎదుర్కుంటారని అమెరికా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సౌందర్య సాధనాల్లో సధాలేట్స్ అనే రసాయనాలు ఉంటాయని వాటిని గర్భిణీలు వినియోగిస్తే.. వారికీ పుట్టబోయే పిల్లలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే దానిపై కొలంబియా విశ్వవిద్యాలయం దృష్టి సారించింది. 11 ఏళ్ళ వయసు ఉన్న బాలబాలికల కదలికలకు సంబంధించి ‘బాట్ 2’ పరీక్షలు నిర్వహించింది. వారిలో కొంతమంది చురుగ్గా లేకపోవడం.. పైగా వారి పనులను వారు చేసుకోలేకపోవడాన్ని గుర్తించారు పరిశోధకులు. కారణం ఏంటని పరిశోధించగా వారి తల్లులు గర్భిణులుగా ఉన్నప్పుడు ప్రమాదకరమైన రసాయనాలు వాడినట్లు తెలిసింది. గర్భిణులు వాడే రసాయనాల కారణంగా వారి పిల్లలు యుక్త వయసు వచ్చేసరికి చాలా ఇబ్బందులు పడతారని నిపుణులు అంటున్నారు. చురుగ్గా కదల్లేరు, ఆత్మన్యూనత, తీవ్రస్థాయి ఆందోళన, వ్యాకులత, ప్రవర్తన సంబంధ సమస్యలు వస్తాయట. తల్లులు కాబోయేవారు వీటితో పాటు ప్లాస్టిక్ వస్తువులు కూడా వాడకపోతే మంచిదని వారి సూచన.