వైరల్ వీడియో: కుక్క దాగుడు మూతలు చూసి తీరాల్సిందే..!

'మంకీ' అనే ఓ కుక్క.. చిన్నారితో కలిసి దాగుడు మూతలు ఆడటం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. జీఎస్డీ ఫ్రెండ్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో మంకీ.. మనుషుల్లాగానే గోడ వైపు తిరిగి..

వైరల్ వీడియో: కుక్క దాగుడు మూతలు చూసి తీరాల్సిందే..!
Follow us

| Edited By:

Updated on: May 08, 2020 | 4:04 PM

కుక్కలు.. మనుషులకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. అందులోనూ ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో కుక్కలు వారి యజమానులకు మరింత ఫ్రెండ్లీగా మారిపోతున్నాయి. ఇప్పటికే టిక్‌ టాక్ వంటి సోషల్ మీడియా యాప్‌లో ఎన్నో రకాల వీడియోలు చూశాం. అయితే ఇటీవల ఓ కుక్క వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. బెల్జియన్ మాలినోయిస్ రకానికి చెందిన ఓ కుక్క.. చిన్నారితో కలిసి దాగుడు మూతలు ఆట ఆడటం అందర్నీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

‘మంకీ’ అనే ఓ కుక్క.. చిన్నారితో కలిసి దాగుడు మూతలు ఆడటం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. జీఎస్డీ ఫ్రెండ్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో మంకీ.. మనుషుల్లాగానే గోడ వైపు తిరిగి కళ్లు మూసుకుంది. అది వెనక్కి తిరగ్గానే అక్కడున్న పాప దాక్కోడానికి వెళ్లింది. ఆమె రెడీ అని చెప్పగానే కళ్లు తెరిచి.. చిన్నారిని వెతికేందుకు పరుగులు పెట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లందరూ వావ్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Read More:

వాహనదారులకు గుడ్‌న్యూస్: సీజ్ చేసిన వెహికల్స్‌ విడుదలకు గ్రీన్ సిగ్నల్

కాస్టింగ్ కౌచ్‌పై ఆదాశర్మ కామెంట్స్.. ఆ నిర్ణయం మీపై ఆధారపడి ఉంటుంది!

గుడ్‌న్యూస్: ఫేస్‌బుక్‌ నుంచి త్వరలో ఫ్రీ ఇంటర్నెట్