వాహనదారులకు గుడ్‌న్యూస్: సీజ్ చేసిన వెహికల్స్‌ విడుదలకు గ్రీన్ సిగ్నల్

ఎట్టకేలకు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లగించి కేసులు నమోదు చేసిన వాహనాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వాహనాలపై ఇప్పటి వరకూ నమోదు అయిన చలాన్స్ చెల్లించుకొని విడుదల చేయనున్నారు తెలంగాణ పోలీసులు. మొదటిసారి చాలన్ల పడిన వాహనాలపై..

వాహనదారులకు గుడ్‌న్యూస్: సీజ్ చేసిన వెహికల్స్‌ విడుదలకు గ్రీన్ సిగ్నల్
Follow us

| Edited By:

Updated on: May 08, 2020 | 12:06 PM

ఎట్టకేలకు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లగించి కేసులు నమోదు చేసిన వాహనాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వాహనాలపై ఇప్పటి వరకూ నమోదైన చలాన్స్ చెల్లించుకొని విడుదల చేయనున్నారు తెలంగాణ పోలీసులు. మొదటిసారి చాలన్ల పడిన వాహనాలపై sec 179 కింద కేసు నమోదు చేసి.. సుమారు 500 రూపాయలను జరిమానా చెల్లించి వాహనాలను తీసుకెళ్లే విధంగా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేశారు. కాగా జరిమానాను ఫోన్ పే, గూగుల్ పే, మీ సేవ ద్వారా చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే sec 188 ఐపీసీతో పాటు 207 ఐపీసీ కేసు నమోదు చేసి ఎపిడమిక్ డిసీస్ యాక్ట్ కింద పోలీసులు సీజ్ చేసిన వాహనాలు కోర్టుకి వెళ్లి తీసుకోవాలి వారు స్పష్టం చేస్తున్నారు. సుమారుగా 1.60 లక్షల వాహనాలను సీజ్ చేసినట్టు సమాచారం. ఇందులో లక్షకు పైగా సివిల్ పోలీసులు కేసులు నమోదు చేయగా, 60 వేలకు పైగా ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. లా అండ్ ఆర్డర్ నమోదు చేసిన వాహనాలపై ఇంకా స్పష్టత రావాలిసి ఉంది.

Read More:

హైదరాబాద్‌లోనూ ప్రాణాలు తీసే రసాయనాలెన్నో..

బ్రేకింగ్: మృతుల కుటుంబాలకి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన జగన్