Breaking: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్…

తాజాగా మరో కేంద్ర మంత్రికి కరోనా నిర్ధారణ అయ్యింది. కేంద్ర జౌళి పరిశ్రమ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి కరోనా సోకింది.

Breaking: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్...
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 28, 2020 | 7:10 PM

Smriti Irani Corona Positive: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. మెల్లమెల్లగా అన్ని వర్గాలను తాకుతుంది. కరోనా రాకాసి బారినపడుతన్న కేంద్ర మంత్రుల జాబితా క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో కేంద్ర మంత్రికి కరోనా నిర్ధారణ అయ్యింది. కేంద్ర జౌళి పరిశ్రమ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి కరోనా సోకింది.

తాజాగా ఆమె చేయించుకున్న పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని.. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు తనతో కాంటాక్ట్ అయినవారిని పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. అటు బీహార్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో స్మృతి ఇరానీ ఎన్డీయే తరపున పలు బహిరంగ సభల్లో చురుగ్గా పాల్గొన్నారు.

కాగా, ఇటీవల పలువురు కేంద్ర మంత్రులకు కరోనా సోకింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కైలాష్ చౌదరి సహా పలువురు కేంద్ర మంత్రులు కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారు.

Also Read:

ముంబై ఇండియన్స్‌కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్‌మ్యాన్.!

మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..

భక్తులకు శుభవార్త.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల..

రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులిటెన్..