AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 10 AM

1.చంద్రుడికి మరింత చేరువలో చంద్ర‌యాన్-2 యావత్ భారతదేశం గర్వపడేలా ఇండియన్ సైంటిస్టులు నిర్వహించిన మిషన్ మూన్ ప్రయోగం నుంచి లేటెస్ట్ అబ్డేట్ వచ్చింది.  ఈ నెల 22న అంతరిక్షంలోకి  ఇస్రో ప్రయోగించిన  చంద్రయాన్-2 వాహకనౌక భూ కక్ష్యను మూడ‌వ‌సారి పెంచారు సైంటిస్టులు…Read More 2.సీఎం జగన్‌తో జపాన్ కాన్సులేట్ జనరల్ భేటి! అమరావతి: చెన్నైలో ఉన్న జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కొజిరొ ఉచియామ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు సహా […]

టాప్ 10 న్యూస్ @ 10 AM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 30, 2019 | 10:00 AM

Share

1.చంద్రుడికి మరింత చేరువలో చంద్ర‌యాన్-2

యావత్ భారతదేశం గర్వపడేలా ఇండియన్ సైంటిస్టులు నిర్వహించిన మిషన్ మూన్ ప్రయోగం నుంచి లేటెస్ట్ అబ్డేట్ వచ్చింది.  ఈ నెల 22న అంతరిక్షంలోకి  ఇస్రో ప్రయోగించిన  చంద్రయాన్-2 వాహకనౌక భూ కక్ష్యను మూడ‌వ‌సారి పెంచారు సైంటిస్టులు…Read More

2.సీఎం జగన్‌తో జపాన్ కాన్సులేట్ జనరల్ భేటి!

అమరావతి: చెన్నైలో ఉన్న జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కొజిరొ ఉచియామ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. జపాన్‌లో పర్యటించాలంటూ ముఖ్యమంత్రి జగన్‌ను ఉచియామ ఆహ్వానించారు…Read More

3.బ్రేకింగ్: బీఫార్మసీ విద్యార్థిని సోని ఆచూకీ లభ్యం

ఏడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో కిడ్నాప్‌కు గురైన బీఫార్మసీ విద్యార్థిని సోని ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ప్రకాశం జిల్లా అద్దంకిలో కిడ్నాపర్ రవి శేఖర్ ఆమెను వదిలివెళ్లిపోయాడు…Read More

4.ప్రముఖ రచియిత్రి భాగ్యలక్ష్మీ కన్నుమూత

ప్రముఖ రచయిత్రి, నందీ అవార్డు గ్రహీత కొల్లూరి భాగ్యలక్ష్మీ గుండెపోటుతో కన్నుమూశారు. చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఆవిడ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఇటీవల తమిళనాడు కంచిలోని అత్తివరదర్ పెరుమాల్ దర్శనం కోసం హైదరాబాద్ నుంచి వెళ్లారు…Read More

5.చివరి రోజుకి చేరుకున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

పదమూడు రోజులపాటు కొనసాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. కాగా నేడు ప్రశ్నోత్తరాలకు ఎక్కువ సమయం కేటాయించనున్నారు. ముఖ్యంగా అన్న క్యాంటీన్‌ల మూసివేత.. Read More

6.”అలా చేసింది బీజేపీ ఎమ్మెల్యే అయితే ప్రశ్నించకండి” రాహుల్ గాంధీ ట్వీట్

ఉన్నావ్ అత్యాచార బాధితురాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ స్పందించారు. రోడ్డుప్రమాదంగా కనిపిస్తున్న ఈ ఘటనపై అనేక అనుమానాలు రేగుతున్న నేపథ్యంలో…Read More

7.ప్రెస్ అకాడమీ ఛైర్మన్ పదవీకాలం పొడిగింపు

తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా అల్లం నారాయణను కొనసాగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి …Read More

8.దేశవ్యాప్తంగా వర్ష బీభత్సం.. ముంబైకి రెడ్ అలర్ట్..!

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. ఇంకా రెండు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు…Read More

9.మెగాస్టార్‌తో మరోసారి..?

తన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి షూటింగ్‌ను పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం కొరటాల మూవీ కోసం సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ కొత్త లుక్‌లో కనిపించనుండగా…Read More

10.కోచ్‌గా శాస్త్రి గారు కొనసాగితే నేను హ్యాపీనే: కోహ్లీ

టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి కొనసాగితే తనకు సంతోషమేనని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌తోనే రవిశాస్త్రి పదవీకాలం ముగిసింది. అయితే వెస్టిండీస్ పర్యటన ముగిసే వరకు ఆయన పదవీకాల గడువు పెంచింది బీసీసీఐ…Read More