ప్రముఖ రచయిత్రి భాగ్యలక్ష్మీ కన్నుమూత

ప్రముఖ రచయిత్రి, నందీ అవార్డు గ్రహీత కొల్లూరి భాగ్యలక్ష్మీ గుండెపోటుతో కన్నుమూశారు. చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఆవిడ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఇటీవల తమిళనాడు కంచిలోని అత్తివరదర్ పెరుమాల్ దర్శనం కోసం హైదరాబాద్ నుంచి వెళ్లారు. దర్శనం అనంతరం అరక్కోణం చేరుకున్నారు. అక్కడి నుంచి చెన్నై-ఎగ్మోర్‌ రైల్లో హైదరాబాద్‌ తిరుగు ప్రయాణంలో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ తరలించారు. ఆమె విపుల మాసపత్రికలో పనిచేసి దశాబ్దం క్రితం ఉద్యోగ విరమణ […]

ప్రముఖ రచయిత్రి భాగ్యలక్ష్మీ కన్నుమూత
Follow us

| Edited By:

Updated on: Jul 30, 2019 | 10:09 AM

ప్రముఖ రచయిత్రి, నందీ అవార్డు గ్రహీత కొల్లూరి భాగ్యలక్ష్మీ గుండెపోటుతో కన్నుమూశారు. చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఆవిడ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఇటీవల తమిళనాడు కంచిలోని అత్తివరదర్ పెరుమాల్ దర్శనం కోసం హైదరాబాద్ నుంచి వెళ్లారు. దర్శనం అనంతరం అరక్కోణం చేరుకున్నారు. అక్కడి నుంచి చెన్నై-ఎగ్మోర్‌ రైల్లో హైదరాబాద్‌ తిరుగు ప్రయాణంలో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ తరలించారు. ఆమె విపుల మాసపత్రికలో పనిచేసి దశాబ్దం క్రితం ఉద్యోగ విరమణ చేశారు. 2003లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ రచయిత్రిగా పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె కుమారుడు అమెరికాలో, కుమార్తె బెంగళూరులో నివసిస్తున్నారు. లక్ష్మి రేడియో వ్యాఖ్యాతగా, వక్తగా, విమర్శకురాలిగా, కథా రచయిత్రిగా బహుముఖ ప్రజ్ఞ చాటారు. మనసున మనసై, జూకామల్లి కథల సంపుటాలు వెలువరించారు. ఆమె రాసిన వీక్షణం, గమనం కవితా సంకలనాలు కవయిత్రిగానూ పేరు తెచ్చాయి.

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!