Viral: కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
సాధారణంగా ఎవరైనా కొత్త కారుగానీ, బైక్ గానీ కొన్న తర్వాత ఎలాంటి ప్రమాదాలూ జరగకూడదని, ఆ వాహనం తమకు కలిసి రావాలని మొక్కుకుంటూ ఆలయంలో వాహన పూజ చేయిస్తారు. ఇదొక సంప్రదాయం మాత్రమే కాదు, కొత్తగా కొన్న వాహనాలను దైవానికి సమర్పించి ఉపయోగిస్తే శుభం కలుగుతుందని విశ్వసిస్తారు. అలా ఓ వ్యక్తి కొత్త కారును తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలో పూజ చేయించాడు. అంతలోనే ఊహించని విధంగా ప్రమాదానికి గురై కారు ధ్వంసమైంది.
తమిళనాడులోని కడలూరుకు చెందిన సుధాకరన్ అనే వ్యక్తి కొత్తగా కారు కొనుగోలు చేశాడు. శ్రీముష్ణం ప్రాంతంలోని ఆలయంలో ఆ వాహనానికి పూజలు చేయించాడు. అనంతరం డ్రైవింగ్ సీటులో కూర్చున్న సుధాకరన్ బయట ఉన్న ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. పూజ పూర్తయిపోవడంతో కారును కాస్త ముందుకు తీసుకెళ్దామని ప్రయత్నించాడు. అయితే బ్రేకులు వేయబోయి యాక్సిలేటర్‌ను నొక్కడంతో కారు అదుపుతప్పింది. గుడి మెట్ల మీదుగా ముందుకు దూసుకెళ్లింది. కారును కంట్రోల్ చేసేందుకు బయట ఉన్న వ్యక్తి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఆలయం ప్రాంగణంలోని ఒక స్తంభాన్ని కారు ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారు యజమాని సుధాకరన్ మాత్రం ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ధ్వంసమైన కొత్త కారును పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఆ ఆలయంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.