Red Banana: ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

Red Banana: ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

Anil kumar poka

|

Updated on: May 10, 2024 | 6:11 PM

సాధారణంగా మనం రకరకాల అరటిపళ్లను చూశాం.. తిన్నాం కూడా.. చక్కెరకేళి, అమృతపాణి, కర్పూర, పచ్చ అరటి, కొమ్ము చక్కెరకేళి, బూడిద చక్కెరకేళి ఇలా రకరకాల అరటిపళ్లు చూశాం. అలాగే ఎర్రటి అరటిపళ్లు కూడా మనం చూశాం. అయితే వీటన్నికంటేకూడా ఈ ఎర్రటి అరటిపళ్లు ఎక్కువ పోషక విలువలు కలిగి ఉంటాయన్న సంగతి మీకు తెలుసా? మన దేశంలో చాలా తక్కువగా కనిపిస్తాయి ఎర్రటి అరటిపళ్లు.

సాధారణంగా మనం రకరకాల అరటిపళ్లను చూశాం.. తిన్నాం కూడా.. చక్కెరకేళి, అమృతపాణి, కర్పూర, పచ్చ అరటి, కొమ్ము చక్కెరకేళి, బూడిద చక్కెరకేళి ఇలా రకరకాల అరటిపళ్లు చూశాం. అలాగే ఎర్రటి అరటిపళ్లు కూడా మనం చూశాం. అయితే వీటన్నికంటేకూడా ఈ ఎర్రటి అరటిపళ్లు ఎక్కువ పోషక విలువలు కలిగి ఉంటాయన్న సంగతి మీకు తెలుసా? మన దేశంలో చాలా తక్కువగా కనిపిస్తాయి ఎర్రటి అరటిపళ్లు. కానీ ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో ఈ పళ్లకు చాలా డిమాండ్‌ ఉంటుంది. అవును ఎర్రటి అరటి పండు మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి.

మీరు ఎర్ర అరటిపండు ఎప్పుడైనా తిన్నారా..? పసుపు అరటిపండు కంటే దీనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతూ ఉంటారు. మన దగ్గర ఎప్పుడూ దొరికే అరటిపండ్లతో పోలిస్తే కెరోటినాయిడ్లు, విటమిన్‌-సి ఇందులో ఎక్కువ. మీ రోగనిరోధక వ్యవస్థ, గుండె ఆరోగ్యం, జీర్ణక్రియకు ఇవి ప్రయోజనం చేకూరుస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి సూపర్‌ ఆప్షన్‌ ఈ ఎర్రటి అరటిపండు. అధిక ఫైబర్ కంటెంట్, తక్కువ క్యాలరీ కంటెంట్ కారణంగా, ఎర్రటి అరటిపండ్లు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తాయి. దీంతో తినే ఆహారం తగ్గి బరువు తగ్గుతారు.
కంటి ఆరోగ్యానికి కూడా ఇది ఎంతోబాగా తోడ్పడుతుంది. ఎర్రటి అరటిపండ్లలోని ప్రిబయోటిక్స్, ఫైబర్, మంచి గట్ ఫ్లోరా పెరుగుదలకు తోడ్పడతాయి. వ్యాయామానికి ముందు లేదా తర్వాత ఎర్రటి అరటిపండ్లు తినడం వల్ల మీ ప్రేగు కదలికలు మెరుగుపడతాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.